iDreamPost
android-app
ios-app

సినిమా స్టైల్లో యువకుడి కిడ్నాప్‌.. 2 రోజుల తర్వాత..

  • Published Oct 13, 2023 | 8:20 PM Updated Updated Oct 13, 2023 | 8:20 PM
  • Published Oct 13, 2023 | 8:20 PMUpdated Oct 13, 2023 | 8:20 PM
సినిమా స్టైల్లో యువకుడి కిడ్నాప్‌.. 2 రోజుల తర్వాత..

తమ కుమారుడు ఆఫీస్‌కు వెళ్లి క్షేమంగా తిరిగొస్తాడనుకున్న  ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. ఊహించని రీతిలో కుమారుడు కిడ్నాప్‌ అవ్వటం.. రెండు రోజుల తర్వాత శవమై కనిపించటం వారిని షాక్‌కు గురిచేసింది. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గుర్తు తెలియని కొందరు దుండగులు ఓ యువకుడ్ని కిడ్నాప్‌ చేసి, హత్య చేసిన ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే..

కర్ణాటకలోని దావణగెరెకు చెందిన లోకేష్‌ బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. అక్టోబర్‌ 5వ తేదీ లోకేష్‌ రోజూలానే ఆఫీస్‌కు వెళ్లాడు. ఆఫీస్‌లో డ్యూటీ అయిపోగానే ఇంటికి బయలుదేరాడు. ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా.. హైవే సమీపంలో ఓ వ్యక్తి అతడ్ని అడ్డగించాడు. బలవంతంగా అతడ్ని ఓ బైకుపై ఎక్కించుకుని తీసుకెళ్లిపోయాడు. రాత్రయినా లోకేష్‌ ఇంటికి రాకపోవటంతో అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్త చేపట్టారు.

సీసీ టీవీ కెమెరాల ఆధారంగా లోకేష్‌ది కిడ్నాప్‌గా తేలింది. పోలీసులు లోకేష్‌ కోసం అన్వేషణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్‌ 8న నేలమంగళ దగ్గర లోకేష్‌ శవమై తేలాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. లోకేష్‌ను కిడ్నాప్‌ చేసింది ఎవరు? ఎందుకు హత్య చేశారు? అన్నకోణాలో​ దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom