iDreamPost
android-app
ios-app

తరుచు భార్య ఫోన్ లో బిజీ! అనుమానంతో భర్త చేసిన పనికి..!

  • Published Oct 12, 2023 | 12:21 PM Updated Updated Oct 12, 2023 | 12:21 PM
  • Published Oct 12, 2023 | 12:21 PMUpdated Oct 12, 2023 | 12:21 PM
తరుచు భార్య ఫోన్ లో బిజీ! అనుమానంతో భర్త చేసిన పనికి..!

మెదక్ జిల్లాలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. భార్య తరుచు ఫోన్ లో బిజీగా ఉంటుందని భర్త మందలించాడు. ఇక మరుసటి రోజు భార్య.. భర్తకు ఊహించని షాకిచ్చింది. దీంతో ఆమె చేసిన పనికి అతడు స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అసలు భర్త భార్యను ఏమన్నాడు? దీంతో ఆ మహిళ చేసిన పనేంటి? ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పోతులబోగుడ గ్రామంలో సుధాకర్-అనురాధ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 2013లో వివాహం జరిగింది. కొన్నాళ్లకి వీరికి ముగ్గురు పిల్లలు జన్మించారు. అప్పటి నుంచి ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. ఇదిలా ఉంటే.. సోమవారం భార్య అనురాధ ఫోన్ లో మాట్లాడుతూ కనిపించింది. భర్త చూసి ఎవరని గట్టిగా ప్రశ్నించాడు. తరుచు ఫోన్ లోనే గడుపుతున్నావని మందలించాడు.

ఈ నేపథ్యంలోనే భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఇక అనురాధ మరుసటి రోజు చిట్టీ డబ్బులు కట్టడానికి వెళ్తున్నానని చెప్పి వెళ్లింది. రాత్రైన భార్య తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కంగారుపడ్డ భర్త సుధాకర్ బంధువులందరికీ సమాచారం అందించాడు. అయినా ఆ మహిళ ఆచూకి మాత్రం దొరకలేదు. ఇంట్లో దాచి ఉంచిన రూ.50 వేలు కూడా కనిపించలేదు. ఈ క్రమంలోనే భర్త స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మహిళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఉన్నట్టుండి అనురాధ కనిపించకపోవడంతో ఆమె పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Jojobet GirişjojobetjojobetMadridbetJojobetjojobetJojobetjojobetJojobetjojobetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişşanlıurfa haberbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet