iDreamPost
android-app
ios-app

నలుగురిలో ప్రియురాలి పరువు తీసిన ప్రియుడు!

  • Published Jul 14, 2023 | 9:08 PM Updated Updated Jul 14, 2023 | 9:08 PM
  • Published Jul 14, 2023 | 9:08 PMUpdated Jul 14, 2023 | 9:08 PM
నలుగురిలో ప్రియురాలి పరువు తీసిన ప్రియుడు!

పరువు కోసం కొందరు ఎంతకైన తెగించేస్తారు. చంపడానికైన, చివరికి చావడానికి కూడా లెక్క చేయరు. మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో కొందరు యువతులు కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు. దీంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు మా కూతురు పరువు తీసిందని హత్య చేయడమో, లేదంటే ఆత్మహత్య చేసుకోవడమే చేస్తారు. కానీ, ఓ యువతి అదే పరువు కోసం చావలేదు. ఏం చేసిందో తెలిస్తే షాకవుతారు. ఇంతకు ఆ యువతి ఎవరు? ఆమె పరువు తీసిన వ్యక్తులు ఎవరు? ఇంతకు అసలు స్టోరీ ఏంటంటే?

పోలీసులు కథనం ప్రకారం.. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి పరిధిలోని సుతారిగుడలో శైలజ (25) అనే యువతి నివాసం ఉంటుంది. ఈమె ఇదే ప్రాంతానికి చెందిన దినకర్ అనే యువకుడిని ప్రేమించింది. అతడు కూడా ఆమెను ప్రేమించాడు. అలా వీరి ప్రేమ వ్యవహారం గత రెండేళ్ల నుంచి నడుస్తూ వస్తుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఈ ప్రేమికులు గొడవ పడ్డారు. శైలజ ప్రియుడితో మాట్లాడం మానేసింది. దీంతో దినకర్ జీర్ణించుకోలేకపోయాడు. ఏం చేయాలో తెలియక ఆ యువకుడు అతిగా మద్యం సేవించి ఏకంగా ప్రియురాలి ఇంటికే వెళ్లాడు. అక్కడికి చేరుకున్నాక ఎందుకు మాట్లాడడం లేదని శైలజను అందరి ముందే గట్టిగా ప్రశ్నించి  వెళ్లిపోయాడు.

ఇదంతా కాలనీ వాసులు అంతా గమనించారు. ఇక నా పరువు మొత్తం పోయిందని భావించిన ఆ యువతి.. ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే ఆ అమ్మాయి తల్లిదండ్రులకు ఇంట్లో ఓ నోట్ దొరికింది. అందులో ఏముందంటే..? ‘అమ్మా.. అందరి ముందు నా పరువు పోయింది. ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నాను. నాకోసం వెతకొద్దు..’అంటూ రాసి వెళ్లిపోయింది. దీంతో ఖంగారుపడ్డ ఆ యువతి తల్లిండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువతి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

ఇది కూడా చదవండి: ఆస్పత్రిలో గొడవ పడ్డ పేషెంట్స్.. నిద్రపోయిన టైమ్ చూసి బెడ్ పైనే హత్య!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet