iDreamPost
android-app
ios-app

కలిసిందుకే ప్రియురాలి ఇంటికి వెళ్లిన యువకుడు! దారుణం ఏంటంటే?

  • Published Nov 10, 2023 | 11:22 AM Updated Updated Nov 10, 2023 | 11:22 AM

ఘట్ కేసర్ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు స్థానికంగా ఉండే ఓ బాలికను ప్రేమించాడు. ఇటీవల ఓ రోజు ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి తల్లిదండ్రలు దారుణానికి పాల్పడ్డాడరు. అసలేం జరిగిందంటే?

ఘట్ కేసర్ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు స్థానికంగా ఉండే ఓ బాలికను ప్రేమించాడు. ఇటీవల ఓ రోజు ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి తల్లిదండ్రలు దారుణానికి పాల్పడ్డాడరు. అసలేం జరిగిందంటే?

  • Published Nov 10, 2023 | 11:22 AMUpdated Nov 10, 2023 | 11:22 AM
కలిసిందుకే ప్రియురాలి ఇంటికి వెళ్లిన యువకుడు! దారుణం ఏంటంటే?

ఈ యువకుడి పేరు కరణ్ నాయక్, వయసు 18 ఏళ్లు. స్థానికంగా ఉండే ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమె కూడా ఇతడిని ఇష్టపడింది. అలా ఇద్దరు చాలా కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. కాల్స్ మాట్లాడుకోవడం, అప్పుడప్పుడు కలుసుని మాట్లాడుకునే వారు. అయితే ఇటీవల ఆ బాలిక కుటుంబ సభ్యులు ఏదో పని మీద బయటకు వెళ్లారు. దీంతో ఆ అమ్మాయి ఇంటికి రమ్మని ప్రియుడికి ఫోన్ చేసి చెప్పింది. ఇక ప్రియురాలు చెప్పిందని ఆ యువకుడు ఆమె ఇంటికి వెళ్లాడు. ఇదే విషయం కొందరు స్థానికులు ఆ బాలిక కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

పోలీసుల కథనం ప్రకారం.. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఘట్ కేసర్ అన్నోజిగూడలోని శ్రీలక్ష్మీ నరసింహ కాలనీలో కరణ్ నాయక్ (18) అనే యువకుడు నివాసం ఉండేవాడు. ఇతడు స్థానికంగా నీరు సరఫరా చేసే ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తుండేవాడు. అయితే ఇతడికి ఇదే కాలనీలో ఉంటున్న ఓ బాలిక (15)తో పరిచయం ఏర్పడింది. ఇదే పరిచయంతో ఇద్దరు అప్పుడప్పడు మాట్లాడుకునేవారు. అలా వీరి స్నేహం చివరికి ప్రేమగా మారింది. దీంతో ఒకరినొకరు ప్రేమించుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి వీరి ప్రేమాయణం కొనసాగుతూ వచ్చింది.

ఇదిలా ఉంటే.. ఇటీవల ఆ బాలిక తల్లిదండ్రులు బంధువుల ఫంక్షన్ ఉండడంతో వారు అక్కడికి వెళ్లారు. ఇదే మంచి సమయం అనుకున్న ఆ బాలిక తన ప్రియుడికి ఫోన్ చేసి.. మా ఇంట్లో ఈ రోజు మా అమ్మనాన్న ఫంక్షన్ నిమిత్తం బయటకు వెళ్లారు, నువ్వు ఇంటికి రా అని చెప్పింది. దీంతో ఆ యువకుడు ఎగేసుకుని ప్రియురాలి ఇంట్లో వాలిపోయాడు. కరణ్ నాయక్ ఆ బాలిక ఇంట్లోకి వెళ్తుండగా పక్కింట్లోని కొందరు వ్యక్తులు గమనించి బాలిక తల్లిదండ్రులకు చెప్పారు. వాళ్లు ఈ విషయం తెలుసుకుని హుటాహుటిన అక్కడికి చేరుకుని కరణ్ నాయక్ ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా బయటి నుంచి తాళం వేశారు.

ఆ తర్వాత వీళ్లు లోపలికి వెళ్లి ఆ యువకుడిపై దారుణానికి పాల్పడ్డారు. అతడిని నగ్నంగా చేసి ప్రైవేట్ పార్ట్స్ పై కారం చల్లి కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేశారు. వీరి దాడిలో ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న యువకుడి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత యువతి తల్లిదండ్రులతో పాటు 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

Jojobet GirişjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş