iDreamPost
android-app
ios-app

బరితెగించిన ప్రేమోన్మాది.. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే..!

  • Published Sep 02, 2023 | 2:11 PM Updated Updated Sep 02, 2023 | 2:11 PM
  • Published Sep 02, 2023 | 2:11 PMUpdated Sep 02, 2023 | 2:11 PM
బరితెగించిన ప్రేమోన్మాది.. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే..!

నేటి కాలంలో కొందరు యువకులు అమ్మాయిని లవ్ లో పడేస్తే.. ఇండియాకు గోల్డ్ మెడల్ తెచ్చినంతగా ఫీల్ అవుతున్నారు. ఇంటి పక్కన అమ్మాయిని, కాలేజ్ లో తోటి విద్యార్థినిని ప్రేమించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక మాయ మాటలు ఎన్నో చెప్పి మొత్తానికి ఓ అమ్మాయిని సెట్ చేసుకుంటారు. దీంతో సినిమాలు, షికారులు అంటూ తెగ తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. వీరిని చూసిన తోటి స్నేహితులు.. నేను కూడా ఓ పోరిని సెట్ చేసుకోవాలని అమ్మాయిల వెంట పడుతుంటారు.

ఇక ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్ లో అందమైన అమ్మాయి ఫొటో కనిపిస్తే చాలు.. రిక్వస్ట్ పెట్టడం, ఆక్సెప్ట్ చేయగానే ప్రేమా, గీమా అంటూ వాళ్లను వేధించడం చేస్తుంటారు. అయితే అచ్చం ఇలాగే ఓ యువకుడు సోషల్ మీడియాలో పరిచయమైన ఓ అమ్మాయిని గత కొంత కాలంగా ప్రేమించాలని వెంటపడ్డాడు. ఆమె కాదనే సరికి నడి రోడ్డుపై అందరి ముందే దారుణానికి ఒడిగట్టాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే

పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ కు చెందిన రాజు (27) అనే యువకుడు స్థానికంగా ఎలక్ట్రిషన్ గా పని చేస్తూ ఉండేవాడు. అయితే ఇతడు హైదరాబాద్ పరిధిలోని జగద్గీరిగుట్ట విజయనగర్ కు చెందిన ఓ యువతి (24)ని సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకున్నాడు. ఆమెతో గత కొంత కాలంగా ఛాటింగ్ చేస్తూ వస్తున్నాడు. అలా కొన్నిరోజులు గడిచాక.. నిన్ను ప్రేమిస్తున్నానని మెసేజ్ లు చేశాడు. దీనికి ఆ యువతి అంగీకరించలేదు. అయినా సరే రాజు ఆమెను వేధిస్తూనే ఉండేవాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాజు ఈ యువతి ఉంటున్న విజయనగర్ కు వచ్చాడు. ఆమెను కలిసి.. నన్ను ఖచ్చితంగా ప్రేమించాల్సిందే, కాదంటే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు.

ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక కోపంతో ఊగిపోయిన రాజు.. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆ యువతిపై దాడికి దిగాడు. ఇంతటితో సరిపెట్టకుండా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే గమనించిన స్థానికులు అతడి చేతులో ఉన్న కత్తిని స్వాధీనం చేసుకుని ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ యువతి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనంతరం ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు రాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ప్రేమకు అంగీకరించలేదని యువతిని హత్య చేయాలని చూసిన ఈ ప్రేమోన్మాది దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom