iDreamPost
android-app
ios-app

మెదక్: ప్రభుత్వ ఉద్యోగం.. బెట్టింగ్ లో రూ.2 కోట్లు పోగొట్టుకోవడంతో తండ్రి దారుణం

  • Published May 12, 2024 | 3:42 PM Updated Updated May 12, 2024 | 3:42 PM

కన్న కొడుకు అనే అనురాగం మరిచి.. అత్యంత దారుణంగా కుమారుడిని అంతం చేశాడు ఓ తండ్రి. మరి అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి అంటే..

కన్న కొడుకు అనే అనురాగం మరిచి.. అత్యంత దారుణంగా కుమారుడిని అంతం చేశాడు ఓ తండ్రి. మరి అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి అంటే..

  • Published May 12, 2024 | 3:42 PMUpdated May 12, 2024 | 3:42 PM
మెదక్: ప్రభుత్వ ఉద్యోగం.. బెట్టింగ్ లో రూ.2 కోట్లు పోగొట్టుకోవడంతో తండ్రి దారుణం

సమాజంలో రోజు రోజుకు చెడు వ్యసనాలు పెరిగి పోతున్నాయి. మద్యం, సిగరెట్లతో పాటు ఇప్పుడు మాదక ద్రవ్యాలు, బెట్టింగ్ వంటి వ్యసనాలు సమాజాన్ని నాశనం చేస్తున్నాయి. బెట్టింగ్ భూతం ఎందరినో బలి తీసుకుంది. చదువు రాని వారో, తెలివిలేని వారో ఈ బెట్టింగ్ భూతానికి బలవుతున్నారా అంటే కాదు.. బాగా చదవుకుని, మంచి ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా బెట్టింగ్ కు అలవాటు పడి.. పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకుని.. చివరకు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ దారుణం వెలుగు చూసింది. బెట్టింగ్ మోజులో పడి 2 కోట్ల రూపాయలు పోగొట్టుకున్న కొడుకును.. కొట్టి చంపాడు ఓ తండ్రి. ఆ వివరాలు..

ఈ దారుణం తెలంగాణ, మెదక్ లో చోటు చేసుకుంది. బాధితుడికి రైల్వేలో ఉద్యోగం.. మంచి జీతం.. భార్యాబిడ్డలతో సంతోషంగా సాగుతుంది జీవితం. కానీ ఆన్ లైన్ బెట్టింగ్ భూతం అతడి జీవితాన్ని నాశనం చేసింది. బెట్టింగ్ మాయలో పడి సుమారు రూ.2 కోట్ల రూపాయలు నష్టపోయాడు. తల్లిదండ్రులకు తెలియకుండ ఇళ్లు, ఇంటి స్థలం అమ్మి మరీ బెట్టింగ్ లకు పాల్పడ్డాడు. ఈ విషయం అతడి తండ్రికి తెలిసి.. యువకుడిని రాడ్డుతో కొట్టి చంపాడు. కొడుకు బెట్టింగ్ లో భారీగా నష్టపోవడంతో.. ఆగ్రహానికి లోనైన తండ్రి.. కన్నబిడ్డ అనే అనురాగం మరిచి.. మరీ హత్య చేశాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

మెదక్‌ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్‌పల్లికి చెందిన ముకేష్ కుమార్‌(28) ర్వైల్వే ఉద్యోగిగా విదులు నిర్వహిస్తున్నాడు. చేగుంట మండలం మల్యాలలో పనిచేస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు సంతానం ఉన్నారు. అయితే బెట్టింగ్, జల్సాలకు అలవాటు పడిన ముఖేష్ .. భారీగా డబ్బులు పోగొట్టుకున్నాడు. బెట్టింగ్‌లో ముకేశ్‌ ఇప్పటివరకు రూ.2 కోట్లు పోగొట్టాడు. మేడ్చల్‌లో ఉన్న ఇళ్లు, ప్లాటు బెట్టింగ్‌ కారణంగా అమ్మేశాడు. ఈక్రమంలో ఇవన్నీ మానుకోవాలని తండ్రి సత్యనారాయణ.. ముకేశ్ ని అనేక సార్లు హెచ్చరించాడు.

ఎన్నిసార్లు చెప్పినా ముకేష్ మారకపోవడంతో.. తీవ్ర అసహనానికి గురైన అతడి తండ్రి సత్యనారాయణ శనివారం రాత్రి కుమారుడిపై దాడి చేశాడు. ఇనుప రాడ్డుతో బలంగా తలపై కొట్టడంతో తీవ్రగాయాలై అక్కడక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.