iDreamPost
android-app
ios-app

తీవ్ర విషాదం : అరగంట వ్యవధిలో తల్లీకొడుకు కన్నుమూత!

గుండెపోటు కారణంగా ఓ వ్యక్తి చనిపోయాడు. కుమారుడు చనిపోయాడని తెలిసి అతడి తల్లి కూడా గుండె పోటుతో చనిపోయింది. ఈ సంఘటన అందర్నీ కంటతడి పెట్టిస్తోంది.

గుండెపోటు కారణంగా ఓ వ్యక్తి చనిపోయాడు. కుమారుడు చనిపోయాడని తెలిసి అతడి తల్లి కూడా గుండె పోటుతో చనిపోయింది. ఈ సంఘటన అందర్నీ కంటతడి పెట్టిస్తోంది.

తీవ్ర విషాదం : అరగంట వ్యవధిలో తల్లీకొడుకు కన్నుమూత!

మృత్యువు ఎవరిని? ఎప్పుడు? ఎలా కబళిస్తుందో ఎవ్వరమూ చెప్పలేము. అప్పటి వరకు బాగానే ఉన్న వారు.. నవ్వుతూ తుళ్లుతూ తిరిగిన వారు ప్రాణాలు కోల్పోతుంటారు. కొన్ని సార్లు దెబ్బ మీద దెబ్బ అన్నట్లు విషాదాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఒకే కుటుంబానికి చెందిన వారు మరణిస్తూ ఉంటారు. మరికొన్ని సార్లు నిమిషాల వ్యవధిలో కుటుంబసభ్యులు చనిపోతూ ఉంటారు. తాజాగా, ఓ తల్లి కుమారుడి మరణవార్త తెలిసి.. బోరున ఏడుస్తూ కన్నుమూసింది.

ఈ సంఘటన మెదక్‌ జిల్లాలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మెదక్‌ జిల్లా కూచన్‌ పల్లి గ్రామానికి చెందిన వీరప్ప గారి నార్సాగౌడ్‌ ఆటో నడుపు జీవిస్తున్నాడు. ఇతడికి పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నార్సాగౌడ్‌ తల్లి లక్ష్మి అతడి వద్దే ఉంటోంది. శనివారం తెల్ల వారుజామున 3 గంటల ప్రాంతంలో నార్సాగౌడ్‌ అస్వస్థతకు గురయ్యాడు. గుండెల్లో నొప్పి వస్తోందని అతడు చెప్పటంతో కుటుంబసభ్యులు ఆస్పతికి వెళాదామని అన్నారు.

అయితే, తేలికపాటి నొప్పి అని చెప్పి.. అతడు నిద్రపోయాడు. కొద్దిసేపటి తర్వాత కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. అతడ్ని పలకరించే ప్రయత్నం చేశారు. నార్సాగౌడ్‌ స్పందించలేదు. దీంతో వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడ్ని పరీక్షించిన వైద్యులు.. నార్సాగౌడ్‌ అప్పటికే మరణించినట్లు తెలిపారు. ఇంటి దగ్గర ఉన్న తల్లి లక్ష్మీ కుమారుడు ఆస్పత్రికి వెళ్లి ఇంకా రాకపోవటంతో ఆందోళనకు గురైంది. కుమారుడ్ని చూడ్డానికి ఏకంగా ఆస్పత్రికి వెళ్లింది.

బెడ్‌పై చలనం లేకుండా సెలెన్‌ బాటిల్‌తో ఉన్న కుమారుడ్ని చూసి ఆమె విలవిల్లాడింది. గట్టిగా ఏడ్వసాగింది. అలా ఏడుస్తూ గుండె పోటుకు గురైంది. గుండె పోటుతో అక్కడికక్కడే చనిపోయింది. ఆమె పరీక్షించిన వైద్యులు.. చనిపోయినట్లు ధ్రువీకరించారు. అరగంట వ్యవధిలో ఇలా ఇద్దరూ చనిపోవటంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. విషయం తెలిసి గ్రామస్తులు సైతం కన్నీరు కారుస్తున్నారు. భర్త మరణం తర్వాత లక్ష్మీ.. తన కుమారుడు నార్సాగౌడ్‌ సర్వస్వంగా జీవించింది.

అతడు తన కళ్లముందే ప్రాణాలు లేకుండా పడి ఉండటం చూసి తట్టుకోలేకపోయింది. కొడుకు లేని ఈ జీవితం తనకు ఎందుకు అనుకుంది. అలానే ప్రాణాలు విడిచింది. మరి, కుమారుడు చనిపోయాడని తెలిసి.. ఏడుస్తూ తల్లి కూడా మరణించిన ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.