iDreamPost
android-app
ios-app

గొడవపడి మరీ ఆమెను పెళ్లి చేసుకున్నాడు.. చివరకు ఊహించని విధంగా..

  • Published Jul 08, 2023 | 5:35 PM Updated Updated Jul 08, 2023 | 5:35 PM
  • Published Jul 08, 2023 | 5:35 PMUpdated Jul 08, 2023 | 5:35 PM
గొడవపడి మరీ ఆమెను పెళ్లి చేసుకున్నాడు.. చివరకు ఊహించని విధంగా..

పెళ్లి.. ఈ మధ్య కాలంలో ఓ బరువైన బాధ్యతలాగా.. ఇష్టంలేని వ్యక్తితో కలిసి నడిచే ఇబ్బందికర ప్రయాణంలాగా మారింది. సమాజంలో కోసమో.. పిల్లల కోసమో ఇష్టంలేని వ్యక్తులతో కలిసి జీవిస్తున్నవారే నూటికి 80 శాంత మంది ఉన్నారు. వీరిలో చాలా మంది దినదిన గండం నూరేళ్ల ఆయుష్షులా జీవితాన్ని సాగిస్తున్నారు. మరి, కొంతమంది గొడవలు పడి దారుణాలకు తెర తీస్తున్నారు. తాజాగా, ఓ వ్యక్తి ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్యపై ఘాతుకానికి ఒడిగట్టాడు. భార్యతో గొడవ పడి ఆమె ప్రాణాలు తీశాడు.

ఈ సంఘటన కర్ణాటకలోని మాండ్య జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటకలోని మాండ్య జిల్లా పాండవపుర తాలూకా, హొసయరగనహళ్లి గ్రామానికి చెందిన గౌతమ్‌ అనే వ్యక్తికి మూడేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన వర్షితా అనే యువతితో వివాహం అయింది. ఈ పెళ్లి జరగటానికి పెద్ద గౌతమ్‌ చాలా కష్టాలే పడ్డాడు. గొడవలు పడి మరీ వర్షితను తన భార్యగా తెచ్చుకున్నాడు. అయితే, పెళ్లయిన  ఓ సంవత్సరం మాత్రమే వీరి కాపురం సజావుగా సాగింది. బిడ్డ పుట్టిన తర్వాతినుంచి గొడవలు మొదలయ్యాయి. డబ్బుల విషయంలో భార్యాభర్తలిద్దరూ ఎప్పుడూ గొడవలు పడుతూ ఉండేవారు.

వారం రోజుల క్రితం కూడా భార్యా భర్తల మధ్య గొడవ జరిగింది. గొడవ సందర్భంగా గౌతమ్‌ తన భార్యపై రెచ్చిపోయాడు. పదునైన ఆయుధంతో ఆమెపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. ఆమె పడిపోగానే గౌతమ్‌ అక్కడినుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న స్థానికులు వర్షితను ఆసుపత్రిలో చేర్చారు. గత వారం రోజులుగా ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్న ఆమె తాజాగా కన్నుమూసింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం అన్వేషిస్తున్నారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet