iDreamPost
android-app
ios-app

అతడిని గుడ్డిగా నమ్మి ప్రేమించింది! అసలు నిజం తెలిశాక!

  • Published Jan 22, 2024 | 4:31 PM Updated Updated Jan 23, 2024 | 6:13 PM

13 ఏళ్ల క్రితం ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్ల పాటు వీరి కాపురం సజావుగా జరిగింది. తర్వాతినుంచి గొడవలు అవ్వటం మొదలైంది.

13 ఏళ్ల క్రితం ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్ల పాటు వీరి కాపురం సజావుగా జరిగింది. తర్వాతినుంచి గొడవలు అవ్వటం మొదలైంది.

  • Published Jan 22, 2024 | 4:31 PMUpdated Jan 23, 2024 | 6:13 PM
అతడిని గుడ్డిగా నమ్మి ప్రేమించింది!  అసలు నిజం తెలిశాక!

ప్రేమ వ్యవహారాలు పెళ్లిళ్ల వరకు వెళ్లటం ఒక ఎత్తయితే.. ప్రేమ పెళ్లి తర్వాత భార్యాభర్తలు ప్రేమగా కలిసి ఉండటం మరో ఎత్తు. నూటికి 70 శాతం ప్రేమ పెళ్లిళ్లు విఫలం అవుతూ ఉ‍న్నాయి. ప్రేమించుకునేటప్పుడు ఒకలా కనిపించిన మనిషి.. పెళ్లి తర్వాత ఇంకోలా కనిపిస్తూ ఉంటాడు. అప్పటికిఇప్పటికీ చాలా తేడా ఉంటుంది. అదే భార్యాభర్తల మధ్య గొడవలకు దారి తీస్తూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు సహజమే కానీ.. ఆ గొడవలు హద్దు మీరితే మాత్రం ఘోరాలు జరుగుతూ ఉంటాయి.

ప్రేమ పెళ్లి చేసుకుని.. పెళ్లి తర్వాత గొడవలు పడి విడిపోయిన వారు ఉన్నారు. గొడవల కారణంగా  ఎదుటి వ్యక్తి ప్రాణాలు తీసిన వారు.. ప్రాణాలు తీసుకున్న వారు కూడా ఉన్నారు. తాజాగా, 13 ఏళ్ల ప్రేమ పెళ్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన కర్ణాటకలోని మండ్య జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

మండ్య జిల్లా రామనగర తాలూకా అంకనహళ్లికి చెందిన పద్మ- మండ్యకు చెందిన సిద్దరాజు 13 ఏళ్ల క్రితం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ప్రస్తుతం వీరిద్దరూ పిల్లలతో కలిసి నెహ్రూ నగర్‌లోని పూర్వ బడావణయల్లికి నివాసం ఉంటున్నారు. పెళ్లయిన కొన్ని రోజులు భర్త సిద్దరాజు పద్మతో సఖ్యంగా ఉండేవాడు. తర్వాతి నుంచి అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. డబ్బుల కోసం ఆమెను ఇబ్బంది పెట్టేవాడు.

ఈ విషయంలో ఇద్దరి మధ్యా తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి. భర్త ఎప్పటికైనా మారతాడని ఆమె భావించింది. కానీ, సంవత్సరాలు గడుస్తున్నా అతడిలో మార్పు రాలేదు. దీంతో పద్మ మనస్తాపానికి గురైంది. బతికి ఉండటం వృధా అనుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు పద్మ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆమె బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిద్దరాజుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet