iDreamPost
android-app
ios-app

దారుణం: చికెన్ వండలేదని భార్యను చంపిన కసాయి భర్త

దారుణం: చికెన్ వండలేదని భార్యను చంపిన కసాయి భర్త

ఈ మధ్యకాలంలో ఊహించని దారుణాలు వెలుగు చూస్తున్నాయి. మరీ ముఖ్యంగా కొందరు భార్యాభర్తలు ప్రతీ చిన్న విషయానికి గొడవ పడుతున్నారు. ఇంతే కాదండోయో.. క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యకు కూడా వెనకాడడం లేదు. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. అయితే, ఈ ఘటనలు మరువకముందే ఓ భర్త బరితెగించి ప్రవర్తించాడు. చికెన్ వండలేదని భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇది ఎక్కడ జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామం. ఇక్కడే గాలిపెళ్లి పోశం( 50)-శంకరమ్మ (45) భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. భర్త పోశం బుధవారం రాత్రి చికెన్ వండాలని భార్యకు చెప్పి బయటకు వెళ్లాడు. కొన్ని గంటల తర్వాత భర్త తిరిగి ఇంటికి వచ్చాడు. ఇక భార్య చికెన్ వండిందేమో అని తినడానికి ఎంతో ఆశతో వచ్చాడు. కానీ, షాకింగ్ న్యూస్ ఏంటంటే? శంకరమ్మ చికెన్ బదులు వంకాయ కూర వండి పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న భర్త పోశం ఒక్కసారిగా కోపంతో ఊగిపోయాడు.

చికెన్ వండమంటే వంకాయ ఎందుకు చేశావు అని భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఇక ఇదే విషయమై భార్యాభర్తుల వాగ్వాదానికి దిగారు. అలా కొన్ని గంటలు పాటు ఇద్దరు తిట్టుకుని నిద్రపోయారు. కానీ, భర్త పోశంకు మాత్రం భార్య శంకరమ్మపై కోపం తగ్గలేదు. ఎలాగైన ఈ రోజు రాత్రి భార్యను చంపాలని స్కెచ్ వేశాడు. ఇందులో భాగంగానే భార్య నిద్రలో ఉండగా ఇంట్లో ఉన్న గొడ్డలితో భర్త పోశం ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం భయంతో అతడికి ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వారి ఇంట్లోకి వెళ్లి చూడగా.. శంకరమ్మ రక్తపు మడుగులో పడి శవమై కనిపించింది.

ఇది చూసి వాళ్లంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. చికెన్ వండలేదని భార్యను హత్య చేసిన భర్త దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: రెచ్చిపోయిన లోన్ యాప్ ఏజెంట్లు.. విద్యార్థి ఆత్మహత్య!

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabettarafbet girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet