iDreamPost
android-app
ios-app

భర్తే జీవితం అనుకుంది.. కానీ, అతడు మాత్రం..

భర్తలో మార్పు వస్తుందని ఆమె ఎంతగానో ఎదురు చూసింది. అయితే, అతడిలో ఎలాంటి మార్పు రాలేదు. దానికితోడు ముందుకంటే దారుణంగా ప్రవర్తించటం మొదలుపెట్టాడు.

భర్తలో మార్పు వస్తుందని ఆమె ఎంతగానో ఎదురు చూసింది. అయితే, అతడిలో ఎలాంటి మార్పు రాలేదు. దానికితోడు ముందుకంటే దారుణంగా ప్రవర్తించటం మొదలుపెట్టాడు.

భర్తే జీవితం అనుకుంది.. కానీ, అతడు మాత్రం..

భర్త అంటే భరించే వాడు అని అర్థం వస్తుంది. పెళ్లి తర్వాత ఆడవాళ్లు కుటుంబాన్ని వదిలి.. అత్తింట్లో అడుగు పెడతారు. భర్తే జీవితంగా బతుకుతూ ఉంటారు. అలాంటి వారి పట్ల కొంతమంది భర్తలు దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు.  భార్య తాను చెప్పిన విధంగా బానిసలా ప్రవర్తించటం లేదనో.. అదనపు కట్నం తేలేదనో.. ఎవేవో కారణాలతో భార్యలను మానసికంగా.. శారీరకంగా ఇబ్బందులు పెడుతున్నారు. భర్తల వేధింపుల కారణంగా నిత్యం నరకం అనుభవిస్తున్న ఇల్లాళ్లు దేశంలో కొన్ని వేల మంది ఉన్నారు.

వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోతున్న వారు కూడా ఉన్నారు. తాజాగా, ఓ మహిళ భర్త వేధింపులు భరించలేక ప్రాణాలు తీసుకుంది. ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయింది. ఈ సంఘటన కేరళలోని మలప్పరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కేరళల మలప్పురం, పందిక్కడ్‌కు చెందిన 25 ఏళ్ల తహ్‌దిలాకు పంటల్లూర్‌ ఈస్ట్‌కు చెందిన మడారి కుటేంగల్‌ నిసార్‌కు కొన్నేళ్ల క్రితం వివాహం అయింది. ఈ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు.

పెళ్లయిన కొన్ని నెలలు వీరి కాపురం సజావుగానే సాగింది. తర్వాతి నుంచి గొడవలు అవ్వటం మొదలైంది. నిసార్‌.. తహ్‌దిల్‌తో తరచుగా గొడవలు పెట్టుకునేవాడు. ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించే వాడు. భర్త ఎప్పటికైనా మారతాడని, తనను బాగా చూసుకుంటాడని ఆమె భావించింది. అయితే, అతడిలో ఎలాంటి మార్పు రాలేదు. దానికితోడు మరింత ఎక్కువగా వేధించేవాడు. దీంతో తహ్‌దిల్‌ విసుగు చెందింది. భర్తలో మార్పురాదని నిశ్చయించుకుంది.

తనకు ఆత్మహత్యే శరణ్యం అని నిశ్చయించుకుంది. గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. తన గదిలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో నిసార్‌ వేధింపుల కారణంగానే తహ్‌దిల్‌ మరణించినట్లు తేలింది. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet