iDreamPost
android-app
ios-app

గంటల వ్యవధిలో బావ, బామ్మర్ది మృతి.. ప్రాణం తీసిన నిద్ర మత్తు

  • Published Aug 08, 2023 | 12:47 PM Updated Updated Aug 08, 2023 | 12:47 PM
  • Published Aug 08, 2023 | 12:47 PMUpdated Aug 08, 2023 | 12:47 PM
గంటల వ్యవధిలో బావ, బామ్మర్ది మృతి.. ప్రాణం తీసిన నిద్ర మత్తు

అప్పటికే ఆ ఇంట్లో ఒకరు మృతి చెందడంతో తీవ్ర విషాదం అలుముకుంది. అనారోగ్యానికి గురైన బామ్మర్ది.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ విషయం తెలుసుకుని మృతుడి బావ.. ప్రైవేట్‌ అంబులెన్స్‌లో బామ్మర్ది మృతదేహాన్ని స్వగ్రామం తీసుకుని వస్తున్నాడు. అప్పటికే బామ్మర్ది మృతి చెంది పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని మృత్యువు మరోసారి వెంటాడింది. బామ్మర్ది మృతదేహాన్ని తీసుకురావడానికి వెళ్లిన బావ కూడా తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురై స్పాట్‌లోనే మృతి చెందాడు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు గంటల వ్యవధిలో ఒకే రోజు కన్ను మూయడంతో.. తీవ్ర విషాదం నెలకొంది. ఆ వివరాలు..

మహబూబాద్ జిల్లాలోని ఇర్సులాపురం గ్రామానికి చెందిన గజ్జి సంపత్‌ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ.. హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. దాంతో సంపత్‌ బావ సారయ్య.. బామ్మర్ది మృతదేహాన్ని ప్రైవేట్‌ అంబులెన్స్‌లో ఇర్సులాపురం గ్రామానికి తీసుకువస్తున్నాడు. అయితే మరిపెడ పట్టణ శివారులో అంబులెన్స్‌ ప్రమాదానికి గురైంది. అంబులెన్స్‌ డ్రైవర్‌ నిద్ర మత్తులో ఉండటంతో.. అది కాస్త కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సారయ్య అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş