iDreamPost
android-app
ios-app

సీఐపై మహిళా కానిస్టేబుల్ దారుణం.. భర్తతో కలిసి ఎంతకు తెగించిందంటే?

మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళా కానిస్టేబుల్ తన భర్తతో చేతులు కలిపి ఏకంగా సీఐ మర్మాంగాలను కోసి కిరాతకానికి పాల్పడింది. రక్తపు మడుగులో ఉన్న అతడిని స్థానికులు వెంటనేఆస్పత్రికి తరలించారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళా కానిస్టేబుల్ తన భర్తతో చేతులు కలిపి ఏకంగా సీఐ మర్మాంగాలను కోసి కిరాతకానికి పాల్పడింది. రక్తపు మడుగులో ఉన్న అతడిని స్థానికులు వెంటనేఆస్పత్రికి తరలించారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

సీఐపై మహిళా కానిస్టేబుల్ దారుణం.. భర్తతో కలిసి ఎంతకు తెగించిందంటే?

మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళా కానిస్టేబుల్ తన భర్తతో చేతులు కలిపి ఏకంగా సీఐ మర్మాంగాలను కోసి కిరాతకానికి పాల్పడింది. స్థానికులు వెంటనే స్పందించి రక్తపు మడుగులో ఉన్న సీఐని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అంతా పరిశీలించారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలంగా మారింది. ఈ మహిళా కానిస్టేబుల్ సీఐని ఎందుకు చంపాలని చూసింది. దీని వెనకాల జరిగిన స్టోరీ ఏంటి? సంచలనంగా మారిన ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రలోని సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఇఫ్తార్ అహ్మద్ అనే వ్యక్తి సీఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇదే ప్రాంతంలో ఓ మహిళా కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇదే మహిళా కానిస్టేబుల్ తన భర్తతో కలిసి తాజాగా ఏకంగా సీఐని హత్య చేయాలని చూసింది. ఇందులో భాగంగానే కత్తితో అతనిపై దాడి చేసి మర్మాంగాలను కోసినట్లుగా తెలుస్తుంది. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతడికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై డీఐజీ చౌహాన్, ఎస్పీ హర్షవర్దన్ వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని అంతా పరిశీలించారు.

అనంతరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ మహిళా కానిస్టేబుల్ తో సీఐ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, దీని కారణంగానే కానిస్టేబుల్ అయిన ఆమె భర్త సీఐని హత్య చేయాలని చూసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు ఈ మహిళా కానిస్టేబుల్ సీఐ ఇఫ్తార్ అహ్మద్ ను హనీట్రాప్ లోకి దింపి అతడిని బ్లాక్ మెయిల్ చేయాలని చూసిందని, ఈ విషయం సీఐకి తెలియడంతో వీరి బండారం బయట పెట్టాలని చూశాడు. ఈ క్రమంలోనే ఈ మహిళా కానిస్టేబుల్ భర్తతో చేతులు కలిపి సీఐ మర్మాంగాలను కోసి హత్య చేయాలని చూసినట్లుగా తెలుస్తుంది. ఇదే ఘటన ఇప్పుడు సంచలనంగా మారుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.