iDreamPost
android-app
ios-app

పిల్లల ముందే భార్యపై భర్త కిరాతకం! ఏం చేశాడో తెలుసా?

  • Published Aug 18, 2023 | 8:09 PM Updated Updated Aug 18, 2023 | 8:09 PM
  • Published Aug 18, 2023 | 8:09 PMUpdated Aug 18, 2023 | 8:09 PM
పిల్లల ముందే భార్యపై భర్త కిరాతకం! ఏం చేశాడో తెలుసా?

దేశంలో రోజు రోజుకు దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు రూపొందించినా దుర్మార్గుల ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు. ఇదిలా ఉంటే.. భార్యాభర్తలు అన్నాక గొడవలు జరగడం సహజం. కానీ, ఇంత దానికే కొందరు దంపతులు ఆత్మహత్య చేసుకోవడం, లేదంటే క్షణికావేశంలో హత్యలకు కత్తులు నూరుతున్నారు. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా రోజుకో చోట జరుగుతూనే ఉన్నాయి. అయితే అచ్చం ఇలాంటి ఘటనలోనే తాజాగా ఒకటి చోటు చేసుకుంది. ఓ భర్త తన కన్న పిల్లల ముందే భార్యపై దారుణానికి ఒడిగట్టాడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారుతోంది.

పోలీసుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ గ్వాలియర్ పరిధిలోని ఖైరీ మోహల్లాలో కమ్లేశ్ చౌదరి- రేఖా చౌదరి దంపతులు నివాసం ఉంటున్నారు వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే.. భర్త కమ్లేశ్ రాను రాను తన బుద్దిని వక్రమార్గంలోకి నెట్టేశాడు. స్థానికంగా ఉండే ఓ మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. భార్యకు తెలియకుండా సీక్రెట్ గా ఈ వ్యవహారాన్ని నడిపిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. కాగా, ఇదే విషయం ఇటీవల భార్య రేఖా చౌదరికి తెలియడంతో భర్తను నిలదీసింది. ఇదే విషయమై తరుచు ఇద్దరు గొడవ పడేవారు.

ఇకపోతే.. శుక్రవారం కూడా ఈ దంపతులు మరోసారి గొడవ పడ్డారు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక క్షణికావేశంలో ఊగిపోయిన భర్త కమ్లేశ్ దారుణానికి ఒడిగట్టాడు. పిల్లల కళ్లముందే భార్యను గొడ్డలితో నరికి పరారయ్యాడు. దీంతో ఆ మహిళ రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్థానికులు అప్రమత్తమై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు కమ్లేశ్ ను అరెస్ట్ చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది.

ఇది కూడా చదవండి: మహిళా రైతుకు అండగా నిలిచిన దిశ యాప్

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom