iDreamPost
android-app
ios-app

తీవ్ర విషాదం.. మైనర్‌ జంట ఆత్మహత్య!

  • Published Jul 12, 2023 | 4:16 PM Updated Updated Jul 12, 2023 | 4:16 PM
  • Published Jul 12, 2023 | 4:16 PMUpdated Jul 12, 2023 | 4:16 PM
తీవ్ర విషాదం.. మైనర్‌ జంట ఆత్మహత్య!

పరీక్షలో తప్పితే ఆత్మహత్య.. తల్లితండ్రులు మందలిస్తే ఆత్మహత్య.. ప్రేమను అంగీకరించకపోయినా ఆత్మహత్య.. ఇలా నేటి సమాజంలో జనం చిన్న చిన్న సమస్యలకు కూడా చావును పరిష్కారంగా భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రోజుకి కొన్ని వందల మంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. ముఖ్యంగా ప్రేమ వ‍్యవహారాల్లో ఆత్మహత్యలు సర్వసాధారణం అయిపోయాయి. తాజాగా, ఇంటర్ చదువుతున్న ఓ యువ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం… సిద్దిపేటకి చెందిన 17 ఏళ్ల కుర్రాడు దుబ్బాక మండలంలో లచ్చాపేట గ్రామం లో నివసిస్తున్నాడు. ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. అదే కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న అమ్మాయితో అతడికి కొన్ని నెలల క్రితం పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. గత ఏడాది నుంచి ఇద్దరు ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమ ఓ ఏడాది వరకు ఎలాంటి గొడవలు లేకుండా బాగానే సాగింది. ఇటీవలే వీరి ప్రేమ వ్యవహారం ఇద్దరి కుటంబసభ్యులకి తెలిసింది.

ఇద్దరు చిన్నపిల్లలు… చదివేది ఇంటర్ మాత్రమే, మైనర్స్ కావడంతో ఇంట్లోవాళ్ళు వీరి ప్రేమని ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరు మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నారు. అబ్బాయి లచ్చాపేట లో ఉంటాడు. అతని తల్లితండ్రులు కొద్దీ రోజుల ముందే పని కోసం దుబ్బాకకి వచ్చి కిరాయి ఇంట్లో నివసిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున ఈ ప్రేమ జంట దుబ్బాకలోని అబ్బాయి ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఇద్దరి కుటుంబసభ్యలు కన్నీరుమున్నీరవుతున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetgrandpashabetcasibomcasibomcasibombetcio giriş