iDreamPost
android-app
ios-app

దారుణం: బెడిసికొట్టిన వివాహేతర సంబంధం.. అందరూ చూస్తుండగానే..!

  • Published Aug 18, 2023 | 4:44 PM Updated Updated Aug 18, 2023 | 4:44 PM
  • Published Aug 18, 2023 | 4:44 PMUpdated Aug 18, 2023 | 4:44 PM
దారుణం: బెడిసికొట్టిన వివాహేతర సంబంధం.. అందరూ చూస్తుండగానే..!

ఏపీలోని కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లై పిల్లలున్న ఓ వ్యక్తితో మరో వివాహితతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. ప్రియురాలితో సన్నిహితంగా ఉండి ఆ తర్వాత ఆమెను పట్టించుకోలేదు. దీంతో పుట్టు బట్టి ప్రియురాలు తననే పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని కోరింది. ఇక అతనికి ఏం చేయాలో తెలియక తాజాగా దారుణానికి ఒడిగట్టాడు. అందరూ చూస్తుండగానే ఊహించని కిరాతకానికి పాల్పడ్డాడు. ఇదంతా కొందరు గ్రామస్తులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. అసలు ఏం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని రాగమయూరిలో కాలనీలో గౌసియా భాను అనే వివాహిత నివాసం ఉంటుంది. భర్త వదిలేయడంతో అప్పటి నుంచి తల్లితో పాటే ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే గౌసియా భాను స్థానికంగా ఉన్న క్రాంతి స్వరూప్ అనే పెళ్లైన వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య వివాహేతర సంబంధంగా మారింది. అలా వీరి చీకటి కాపురం గత కొన్నేళ్ల పాటు కొనసాగుతూనే ఉంది. ఇక వీళ్లిద్దరు శారీరకంగా కూడా కలుసుకున్నారు. దీంతో గౌసియా భాను.. నీ భార్యను వదిలి నాతే పాటే ఉండాలని ప్రియుడు క్రాంతి స్వరూప్ ను కోరినట్లు సమాచారం.

దీనికి అతడు నిరాకరించినట్లుగా తెలుస్తుంది. అయితే ఇదే విషయమై గౌసియా భాను ప్రియుడిని టార్చర్ చేస్తుండడంతో తరుచు గొడవ పడుతూనే ఉన్నారు. శుక్రవారం సైతం ఇద్దరు మరోసారి గొడవ పడ్డారు. ఇక తట్టుకోలేకపోయిన క్రాంతి స్వరూప్.. బండ రాయితో ప్రియురాలు గౌసియా భానుపై దాడికి దిగాడు. ఇదంతా కొందరు వ్యక్తులు వీడియో తీశారు. అనంతరం కొందరు స్థానికులు అతడిని అదుపులోకి తీసుకుని ఆ మహిళను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ వివాహిత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు క్రాంతి స్వరూప్ ను అరెస్ట్ చేశారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

ఇది కూడా చదవండి: ఆర్టీసీ బస్సులో వింత దొంగతనం.. దాన్ని నువ్వేం చేసుకుంటావ్‌ బాబు!

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş