iDreamPost
android-app
ios-app

మరో 15 రోజుల్లో బర్త్ డే.. అంతలోనే ఊహించని విషాదం..!

మరో 15 రోజుల్లో బర్త్ డే.. అంతలోనే ఊహించని విషాదం..!

కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళతో పాటు ఆమె 11 నెలల కూతురు ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోయారు. మరో 15 రోజుల్లో ఈ చిన్నారి బర్త్ డే ఉండగా అంతలోనే ఇలా జరగడంతో మృతురాలి భర్త, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం నాగేశ్వరరావుపేట పరిధిలోని జానకీపురంలో వల్లభూ శివకృష్ణ-అనూష దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతేడాది ధన్సిక (11 నెలలు) జన్మించింది. కూతురు పుట్టడంతో ఆ భార్యాభర్తలు ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మంగళవారం సాయంత్రం అనూష కూతురుని ఎత్తుకుని వాటర్ హీటర్ పెట్టి స్విచ్ ఆన్ చేసింది. దీంతో కరెంట్ షాక్ గురై ఆ మహిళతో పాటు ధన్సిక అక్కడికక్కడే పడిపోయారు. స్థానికులు గమనించి వెంటనే ఆమె భర్తకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకుని భార్య, కూతురిని ఆస్పత్రికి తరలించాడు.

పరీక్షించిన వైద్యులు.. తల్లీకూతురు అప్పటికే మరణించారని నిర్ధారించారు. దీంతో మృతురాలి భర్త, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం పోలీసులు స్పందించి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ తర్వాత కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరో 15 రోజుల్లో బర్త్ డే ఉండగా.. ఈ క్రమంలోనే తల్లీకూతురు చనిపోవడంతో ఆమె భర్త గుండెలు పగిలేలా ఏడ్చారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. కరెంట్ షాక్ తో తల్లికూతురు మరణించిన ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: విద్యార్థి బలవన్మరణం.. కన్నీరు తెప్పిస్తున్న సూసైడ్ నోట్!

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet girişdeneme bonusu