iDreamPost
android-app
ios-app

కన్న కూతురిపై తండ్రి లైంగిక దాడి.. కోర్టు సంచలన తీర్పు!

  • Published Sep 28, 2023 | 5:07 PM Updated Updated Sep 28, 2023 | 5:07 PM
  • Published Sep 28, 2023 | 5:07 PMUpdated Sep 28, 2023 | 5:07 PM
కన్న కూతురిపై తండ్రి లైంగిక దాడి.. కోర్టు సంచలన తీర్పు!

రోడ్డుపై అందమైన అమ్మాయి కనిపిస్తే కొందరు దుర్మార్గులు బరితెగించి లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. మరి కొందరైతే వావి వరసలు మరిచి దారుణాలకు తెగబడుతున్నారు. ఇక అసలు విషయం బయటకు పొక్కకుండా బాధితులను హత్య చేసి ఏం తెలియదన్నట్లుగా చేతులు దులుపుకుంటున్నారు. అయితే అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ తండ్రి కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కిరాతకుడి దారుణం వెలుగులోకి రావడంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం తాజాగా నిందితుడికి ఊహించని శిక్ష విధించింది.

స్థానికుల కథనం ప్రకారం.. కొమరం భీం జిల్లాలోని కాగజ్ నగర్ లో బంజిరాల వెంకట్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి 15 ఏళ్ల కూతురు ఉంది. ఈ బాలిక స్థానికంగా ఉన్న స్కూల్ లో 10వ తరగతి చదువుతోంది. అయితే వెంకట్ తన కూతురిపై కన్నేసినట్లుగా తెలుస్తోంది. విషయం ఏంటంటే? 2022 జూలైలో తన కూతురిపై తండ్రి వెంకట్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇక నవంబర్ లో కూడా మరోసారి కూతురు అన్న కనికరం లేకుండా అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఇదే విషయం ఆ బాలిక తన తల్లికి పూసగుచ్చినట్లు వివరించింది. కోపంతో రగిలిపోయిన ఆ మహిళ.. వెంటనే కాగజ్ నగర్ పోలీసులను ఆశ్రయించి భర్త దారుణంపై ఫిర్యాదు చేసింది.

బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడైన ఆ బాలిక తండ్రిని అదుపులోకి తీసుకుని విచారించారు. కాగా ఇదే కేసును విచారించిన న్యాయస్థానం నిందితుడు వెంకట్ కు 20 ఏళ్ల జీవిత శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు ఇచ్చింది. దీంతో పాటు రూ.6 వేల జరిమానా కూడా విధించింది. ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడిన ఈ దుర్మార్గుడి దారుణంపై మీ అబిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom