iDreamPost
android-app
ios-app

కోల్‌కతా డాక్టర్‌ కేసు! అత్యాచారం చేసే ముందు వ్యభిచార గృహాలకు వెళ్లిన సంజయ్‌!

  • Published Aug 22, 2024 | 6:14 PM Updated Updated Aug 22, 2024 | 6:14 PM

Kolkata Doctor Case, Sanjoy Roy: 31 ఏళ్ల ట్రైని డాక్టర్‌ను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి.. ఆపై హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న సంజయ్‌ రాయ్‌ గురించి వెలుగులోకి వస్తున్న ఒక్కో విషయం విస్తుపోయేలా ఉంది. తాజాగా మరో విషయం తెలుస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Kolkata Doctor Case, Sanjoy Roy: 31 ఏళ్ల ట్రైని డాక్టర్‌ను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి.. ఆపై హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న సంజయ్‌ రాయ్‌ గురించి వెలుగులోకి వస్తున్న ఒక్కో విషయం విస్తుపోయేలా ఉంది. తాజాగా మరో విషయం తెలుస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Aug 22, 2024 | 6:14 PMUpdated Aug 22, 2024 | 6:14 PM
కోల్‌కతా డాక్టర్‌ కేసు! అత్యాచారం చేసే ముందు వ్యభిచార గృహాలకు వెళ్లిన సంజయ్‌!

పది రోజుల పాటు ‘కోల్‌కతా డాక్టర్‌ హత్యాచార’ ఘటన.. దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకోవడం, సీబీఐ రంగంలోకి దిగి.. కేసు దర్యాప్తు వేగవంతం చేస్తూ.. ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ మాజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సందీప్‌ ఘోష్‌ను విచారించడంతో ఇప్పుడిప్పుడే.. ఈ ఘటనపై ప్రజలు కాస్త శాంతిస్తున్నారు. 136 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఆస్పత్రిలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై అత్యంత అమానుషంగా, అతి క్రూరంగా అత్యాచారం చేసి.. ఆపై హింసించి హత్య చేయడంతో దేశం మొత్తం ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. అయితే.. ఈ కేసులో నిందితుడిగా అరెస్ట్‌ అయిన సివిక్‌ వాలంటీర్‌ సంజయ్‌ రాయ్‌ గురించి మతిపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి..

ఈ నెల 8వ తేదీ రాత్రి సమయంలో.. నైట్‌ డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌ ఎమర్జెన్సీ బ్లాక్‌లోగల సెమినార్‌ హాల్‌లో హత్యాచారానికి గురైంది. మరుసటి రోజు ఉదయం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో.. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా కాలేజ్‌ అవుట్‌ పోస్ట్‌లో సివిక్‌ వాలంటీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సంజయ్‌ రాయ్‌ అనే వ్యక్తిని కోల్‌కతా పోలీసులు అరెస్ట్‌ చేశారు. సెమినార్‌ హాల్‌ వైపు అతను వెళ్లడం, కొద్ది సేపటి తర్వాత బయటికి రావడం, డాక్టర్‌ మృతదేహం పక్కన ఒక బ్లూటూత్‌ ఇయర్‌ఫోన్స్‌ లభించడం, అది సంజయ్‌ ఫోన్‌కు కనెక్ట్‌ అయి ఉండటంతో.. అతన్ని నిందితుడిగా గుర్తిస్తూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల ఎక్వైరీలో అతను అత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే.. డాక్టర్‌పై అత్యాచారం చేసే ముందు అతను రెండు సార్లు వ్యభిచార గృహానికి కూడా వెళ్లి వచ్చినట్లు సమాచారం. పైగా అతని ఫోన్‌లో పోర్న్‌ వీడియోలో చాలా ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. పోర్న్‌ వీడియోలు చూసి చూసి.. వాటికి బానిసై.. ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా సీబీఐ అతనికి సైకో అనాలసిస్‌ టెస్ట్‌ కూడా చేశారు. అందులో.. అతను సెక్స్‌కు బానిసై.. ఒక జంతువులా వికృతంగా ప్రవర్తిస్తాడనే విషయాలు వెల్లడయ్యాయి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetTophillbet girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler