iDreamPost
android-app
ios-app

జాలీ రైడ్‌ కోసం అడవికి వెళ్లిన ప్రేమజంట.. ఇంతలోనే దారుణం!

  • Published Sep 24, 2023 | 3:48 PM Updated Updated Sep 24, 2023 | 3:48 PM
  • Published Sep 24, 2023 | 3:48 PMUpdated Sep 24, 2023 | 3:48 PM
జాలీ రైడ్‌ కోసం అడవికి వెళ్లిన ప్రేమజంట.. ఇంతలోనే దారుణం!

వారిద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ కలిసి జాలీరైడ్‌ కోసం కర్ణాటకలోని అడవికి వెళ్లారు. అక్కడ అనుకోని ఘోరం జరిగింది. ప్రియుడు తన ప్రియురాలిని హత్య చేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లోని పీలేరుకు చెందిన హర్షిత, హేమంత్‌ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలకు చెప్పి పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇద్దరూ కలిసి జాలీ రైడ్‌ వెళ్లాలని నిశ్చయించుకున్నారు. వారి ఉండే ప్రాంతం కర్ణాటక బార్డర్‌లో ఉంది. కోలార్‌ జిల్లాలోని శ్రీనివాసర తాలూకా వారికి చాలా దగ్గర. ఇ‍ద్దరూ కలిసి కోలార్‌లోని అడవికి జాలీ రైడ్‌ కోసం వెళ్లారు. అడవిలో తిరుగుతూ ఎంజాయ్‌ చేస్తూ ఉన్నారు. కొంత సేపటి తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ, ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. ఆ గొడవ చినికి చినికి గాలి వానలా తయారైంది. గొడవ సందర్భంగా హేమంత్‌.. హర్షిత్‌పై ఆగ్రహానికి గురయ్యాడు.

ఆమెను కొట్టి చంపేశాడు. అనంతరం అడవినుంచి బయటకు వచ్చేశాడు. అడవిలో యువతి శవం కనిపించడంతో క్రైం స్టోరీ మొదలైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో ఆమెది ఆంధ్రప్రదేశ్‌లోని పీలేరని తేలింది. తర్వాత ప్రియుడి విషయం కూడా బయటకు వచ్చింది. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం ఒప్పుకున్నాడు. దీంతో అతడ్ని అరెస్ట్‌ చేశారు. మరి, ప్రియురాలిని అడవికి తీసుకెళ్లి చంపేసిన హేమంత్‌ ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet