iDreamPost
android-app
ios-app

కూతురు గర్భిణీ అని చూడకుండా తండ్రి దారుణం! ఏం చేశాడో తెలుసా?

  • Published Nov 11, 2023 | 3:29 PM Updated Updated Nov 11, 2023 | 3:29 PM

ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. కన్న కూతురు నిండు గర్భవతి అని కూడా చూడకుండా నడి రోడ్డుపై కిరాతకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. కన్న కూతురు నిండు గర్భవతి అని కూడా చూడకుండా నడి రోడ్డుపై కిరాతకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

  • Published Nov 11, 2023 | 3:29 PMUpdated Nov 11, 2023 | 3:29 PM
కూతురు గర్భిణీ అని చూడకుండా తండ్రి దారుణం! ఏం చేశాడో తెలుసా?

ఈ రోజుల్లో అనుబంధాలు, ప్రేమానురాగాలు, ఆప్యాయతలు కుటుంబాల్లో రోజు రోజుకు కరువవుతున్నాయి. వావి వరసలు లేకుండా ఎవరూ ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. ఇంతే కాకుండా కన్న కూతురిపై తండ్రి అత్యాచారం చేసిన ఘటనలు కూడా ఎన్నో జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. ఇకపోతే.., మరి కొందరు తల్లిదండ్రులు మాత్రం.. స్వార్థ ప్రయోజనాల కోసం కన్నవాళ్లను కూడా లెక్క చేయకుండా హత్యలకు కత్తులు నూరుతున్నారు. ఇలాంటి వరుస ఘటనలు మరువకముందే ఇలాంటి ఘోరమైన ఘటన మరొకటి చోటు చేసుకుంది. ఓ తండ్రి కూతురు నిండు గర్భిణీ అని కూడా చూడకుండా నడి రోడ్డుపై దారుణానికి పాల్పడ్డాడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారుతోంది. ఇంతకు ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా వైరా మండలం తాటిపూట గ్రామంలో రాములు-మంగమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కుమారులతో పాటు ఉషశ్రీ అనే కూతురు కూడా ఉంది. అయితే ఆమె తల్లిదండ్రులు గత పదేళ్ల కిందట రామకృష్ణ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు. ఇదిలా ఉంటే.. ఉషశ్రీ చిన్నప్పటి నుంచి తాతయ్య-నాన్నమ్మ వద్దే పెరిగింది. దీంతో వాళ్లు మనవరాలు పెళ్లి సమయంలో మనవరాలు పేరు మీద కొంత ఆస్తితో పాటు ఇంటి స్థలం కూడా రాసిచ్చారు. ఇకపోతే.. గత కొంత కాలం నుంచి ఉషశ్రీ తల్లిదండ్రులు ఎక్కవ ఆస్తి కూతురు పేరు మీదే రాసిచ్చారని గొడవ పడుతూ ఉన్నారు. ఇదే విషయంపై పలుమార్లు గొడవ పడి కోర్టుల చుట్టు కూడా తిరుగుతున్నార.

మరో విషయం ఏంటంటే? పెళ్లైన పదేళ్లకు ఉషశ్రీ గర్భం దాల్చింది. దీంతో ఈ మహిళ ప్రస్తుతం 5 నెలల గర్భవతి కావడం విశేషం. ఇదిలా ఉంటే.. శుక్రవారం రాములు అతని కుమారులు కలిసి ఉషశ్రీ ఆమె భర్త రామకృష్ణతో ఆస్తి గురించి మరోసారి గొడవకు దిగారు. క్షణికావేశంలో ఊగిపోయిన తండ్రి రాములు.. కొడుకులతో కలిసి గొడ్డలితో కూతురు, అల్లుడిపై దాడి చేసే ప్రయత్నం చేయబోయారు. ఇది గమనించిన ఉషశ్రీ, రామకృష్ణ దంపతులు ఇద్దరు చెరో దారిలో పరుగెత్తారు. అయినా వదలని రామకృష్ణ, అతని కుమారులు.. కూతురు 5 నెలల గర్భవతి అని చూడకుండా ఆమెను పరుగెత్తించి పరుగెత్తించి దాడి చేశారు.

వీరి దాడిలో రామకృష్ణ తీవ్రంగా గాయపడగా, ఉషశ్రీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. వెంటనే స్పందించిన స్థానికులు తీవ్రంగా గాయపడ్డ రామకృష్ణను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ దారుణ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. ఆస్తి కోసం రాములు కన్న కూతురు అని చూడకుండా అతి కిరాతకంగా హత్య చేసిన అతని దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibom