Uppula Naresh
Uppula Naresh
కర్ణాటకలోని ఓ ప్రాంతంలో ఇటీవల ఓ యువతి, యువకుడికి ఘనంగా వివాహం జరిగింది.పెళ్లైన కొన్ని రోజుల పాటు ఆ నవ వధువు వరుడి ఇంట్లోనే గడిపింది. ఇక ఉన్నన్ని రోజులు ఎలాంటి అనుమానం రాకుండా భర్త, అతని తల్లిదండ్రులతో సంతోషంగా గడిపింది. మంచి కోడలి వచ్చిందని వరుడి తల్లిదండ్రులు కూడా మురిసిపోయారు. ఈ క్రమంలోనే ఆ నవ వధువు వరుడికి షాకిచ్చింది. నవ వధువు ఇలా చేయడంతో వరుడు, ఆమె కుటుంబ సభ్యులకు ఒక్కసారిగా దిమ్మతిరిగినంత పనైంది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకలోని ఉడుపి జిల్లా కుందాపుర పరిధిలోని ఉల్లరు-74 గ్రామానికి చెందిన ఓ యువకుడికి, వడేరహోబళికి చెందిన ఓ యువతితో ఇటీవల వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఆ నవ వధువు వరుడి ఇంట్లోనే గడిపింది. ఈ క్రమంలోనే అత్తింటివాళ్లతో ఆమె నవ్వుతు సంతోషంగానే కనిపించింది. ఇక మంచి కోడలు వచ్చిందని వరుడి తల్లిదండ్రులు కూడా మురిసిపోయారు. అయితే, ఉన్నట్టుండి ఆ నవ వధువు వరుడి ఇంట్లో ఉన్న రూ.10 లక్షల నగదు తీసుకుని ప్రియుడితో పారిపోయింది. అదే రోజు ఇంట్లో నవ వధువు కనిపించకపోవడంతో ఆమె భర్త అంతటా వెతికాడు. కానీ, ఆ యువతి జాడ మాత్రం దొరకలేదు.
ఇదే సమయంలో ఇంట్లో ఉన్న రూ.10 లక్షల నగదు కూడా కనిపించకపోవడంతో అందరూ ఆ నవ వధువు పనే అనుకున్నారు. ఇక చేసేదేం లేక ఆ నవ వధువు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ నవ వధువు ఇచ్చిన షాక్ తో వరుడికి దిమ్మతిరిగింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: నా స్నేహితుడితో పడుకో అంటూ భార్యను టార్చర్ పెట్టిన భర్త!