iDreamPost
android-app
ios-app

కిలాడీ లేడీ వలలో 50 మంది యువకులు! పోలీసులే షాక్!

  • Published Aug 19, 2023 | 6:19 PM Updated Updated Aug 19, 2023 | 6:19 PM
  • Published Aug 19, 2023 | 6:19 PMUpdated Aug 19, 2023 | 6:19 PM
కిలాడీ లేడీ వలలో 50 మంది యువకులు! పోలీసులే షాక్!

నేటి కాలంలో సాంకేతిక యుగం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. దీని వల్ల లాభం ఎంతుంటే అంతకుమించి నష్టాలు కూడా లేకపోలేదు. గతంలో జరిగిన ఎన్నో ఘటనలు ఉదాహరణలుగా చెప్పొచ్చు. అయితే, కొందరు వ్యక్తులు మాత్రం ఇదే సాంకేతికతను ఆసరాగా చేసుకుని ఎవరూ ఊహించని రీతిలో చాపకింద నీరులా మోసాలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాగే తెలిపి ప్రదర్శించిన ఓ అమ్మాయి తన అందంతో ఏకంగా 50 మంది కుర్రాళ్లను మోసం చేసింది. నైస్ గా మాట్లాడి ఐస్ చేసి నాతో గడపాలని కోరుతుంది. ఇక కరిగిపోయిన కొందరు యువకులు ఆమె వలకు చిక్కి చివరికి లబోదిబోమంటున్నారు. ఇంతకు జరిగింది ఏంటంటే?

పోలీసుల కథనం ప్రకారం.. పైన ఫొటోలో అందంగా కనిపిస్తున్న అమ్మాయి పేరు నేహా. ముంబైకి చెందిన ఈ కిలాడీ లేడీ కష్టపడకుండా డబ్బులు ఈజీగా ఎలా సంపాదించాలనే మార్గాలను వెతికింది. ఇందులో భాగంగానే తన అందాన్ని ఆసరాగా చేసుకుని డబ్బును పోగేసుకోవాలని భావించింది. ఇంతకి ఈ అందాల సుందరి చేసిందేంటంటే? టెలీగ్రామ్ లో చాలా మంది యువకులను పరిచయం చేసుకుంది. ఇక వారితో నైస్ గా మాట్లాడి ఐస్ చేసేస్తుంది. నా భర్త విదేశాల్లో ఉన్నాడని, నాతో గడపాలని కోరుతుంది. ఇక ఆమె మాటలకు కరిగిపోయిన కొందరు కుర్రాళ్లు.. ఆమె వలకు చిక్కుకున్నారు. మొత్తానికి ఆమెతో గడపడానికి సిద్దపడిన యువకులకు తన అడ్రస్ పెడుతుంది. దీంతో ఆ కుర్రాళ్లు ఎగేసుకుని నేరుగా ఆమె గదిలోకి వెళ్లారు.

ఆ యువకులు ఆమెతో ఉన్న సమయంలో ఈ యువతి దొంగచాటున వీడియోలు తీసుకుంది. అదే వీడియోలను వారికి చూపించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు రాబట్టుకుంది. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 50 యువకులు ఆమె వలలో చిక్కుకుని నిండా మోసపోయినట్లు తెలుస్తుంది. ఇక చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఓ బాధితుడు.. ఇటీవల కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు ఈ కిలాడీ లేడిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనంగా మారుతోంది. నేటి కాలంలో కొందరు హనీ ట్రాప్ లకు పాల్పడుతున్నారని, ఇవేం తెలియని యువకులు మోసపోతున్నారు. ఇలాంటి వారిపట్ల యువత కాస్త జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: అందం, అరాచకం కలిస్తే ఆ లేడీ డాన్‌.. 35 ఏళ్లకే మూడు లవ్‌ స్టోరీస్‌!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom