iDreamPost
android-app
ios-app

ప్రేమించి పెళ్లి.. 3 నెలల కిందట భార్య మిస్సింగ్! వెన్నులో వణుకు పుట్టిస్తున్నక్రైమ్ స్టోరీ!

  • Published Nov 07, 2023 | 4:03 PM Updated Updated Nov 07, 2023 | 4:03 PM

ఈ దంపతులు చాలా ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంత కాలానికి వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇదిలా ఉంటే.. గత 3 నెలల కిందట అతని భార్య ఉన్నట్టుండి కనిపించకుండాపోయింది. దారుణం ఏంటంటే?

ఈ దంపతులు చాలా ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంత కాలానికి వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇదిలా ఉంటే.. గత 3 నెలల కిందట అతని భార్య ఉన్నట్టుండి కనిపించకుండాపోయింది. దారుణం ఏంటంటే?

  • Published Nov 07, 2023 | 4:03 PMUpdated Nov 07, 2023 | 4:03 PM
ప్రేమించి పెళ్లి.. 3 నెలల కిందట భార్య మిస్సింగ్! వెన్నులో వణుకు పుట్టిస్తున్నక్రైమ్ స్టోరీ!

ఈ రోజుల్లో చాలా మంది యువతి, యువకులు తల్లిదండ్రులు కుదిర్చిన వివాహాల కన్న ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. లవ్ మ్యారేజ్ లు చేసుకుని సంతోషంగా ఉంటున్నారా అంటే అదీ లేదు. కట్టుకున్న వాళ్ల కళ్లు గప్పి వివాహేతర సంబంధాలతో ఎంజాయ్ చేస్తున్నారు. తీరా అసలు విషయం బయటపడడంతో ప్రేమించిన వారితో లేచిపోవడం, లేదంటే హత్యలు చేయడం, ఇదీ కాకుంటే చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో నమోదవుతున్న కేసులు కూడా ఇలాంటివేనని పోలీసులు చెబుతున్నారు. అయితే అచ్చం ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికుల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. సంచలనంగా మారిన ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక హసన్ లోని ఓ ప్రాంతంలో వాసు-శాంతి దంపతులు నివాసం ఉండేవారు. వీరు చాలా ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంత కాలానికి వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. ఇక పుట్టిన పిల్లలను చూసుకుంటూ ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. ఇక భార్యాభర్తలు చెరో చోట పని చేస్తూ ఉండేవారు. అయితే ఈ క్రమంలోనే ఆమె భర్త వాసు వక్రమార్గంలోకి వెళ్లాడు. భార్య కళ్లుగప్పి స్థానికంగా ఉండే ఓ మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. అలా చాలా కాలం పాటు ఈ విషయాన్ని భార్యకు తెలియకుండా వాసు మేనేజ్ చేస్తూ వచ్చాడు.

కానీ, ఈ విషయం చాన్నాళ్లు దాగక ఇటీవల అతని భార్య శాంతికి తెలిసింది. ఇదేం పనంటూ భర్తను గట్టిగానే నిలదీసింది. ఇదే విషయంపై ఈ దంపతులు తరుచు గొడవ పడుతూ ఉండేవారు. ఇకపోతే.. 3 నెలల కిందట ఇతని భార్య శాంతి ఉన్నట్టుండి కనిపించకుండాపోయింది. ఆమె భర్త కూడా కనిపించలేదు. దీంతో శాంతి కుటుంబ సభ్యులు అంతటా వెతికినా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరిద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ క్రమంలోనే పోలీసులకు వాసు జాడ దొరికింది. ఆ తర్వాత పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని శాంతి ఎక్కడ అని ప్రశ్నించారు.

కానీ, వాసు పొంతనలేని సమాధానాలు చెప్పాడు. ఇక పోలీసుల స్టైల్ లో విచారించేసరికి వాసు అసలు నిజాలు బయటపెట్టాడు. నేను మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించానని, దీంతో నా భార్య పదే పదే ఈ విషయం గురించి ప్రశ్నించేది. ఇది నచ్చక శాంతిని చంపి ఓ చోట పాతి పెట్టానని వాసు తన నేరాన్ని అంగీకరించాడు. అనంతరం పోలీసులు నిందితుడి వివరాల ప్రకారం.. పాతిపెట్టిన ఆ మహిళ శవాన్ని బయటకు తీశారు. ఆ తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అసలు నిజాలు బయటకు రావడంతో మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibom