iDreamPost
android-app
ios-app

అమ్మ కష్టాన్ని చూడలేక తండ్రిని చంపిన కొడుకు!

  • Published Nov 06, 2023 | 6:15 PM Updated Updated Nov 06, 2023 | 6:15 PM

కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు తన తల్లి కష్టాన్ని చూడలేక అతని తండ్రిని దారుణంగా హత్య చేశాడు. అసలేం జరిగిందంటే?

కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు తన తల్లి కష్టాన్ని చూడలేక అతని తండ్రిని దారుణంగా హత్య చేశాడు. అసలేం జరిగిందంటే?

  • Published Nov 06, 2023 | 6:15 PMUpdated Nov 06, 2023 | 6:15 PM
అమ్మ కష్టాన్ని చూడలేక తండ్రిని చంపిన కొడుకు!

కొందరు వ్యక్తులు రాక్షసుల్లా ప్రవర్తిస్తూ ప్రతీ చిన్న విషయానికి కూడా కన్న తల్లిపై చేయి చేసుకుంటున్నారు. కనిపెంచిన తల్లి అన్న కనికరం లేకుండా ఆమెపై దారుణాలకు తెగబడుతున్నారు. ఇలాంటి ఎన్నో ఘటనలు దేశంలో చాలా చోట్ల వెలుగు చూశాయి. కానీ, నవ మాసాలు మోసి పెంచి పెద్ద చేసిన తల్లి కష్టాలు, ఇబ్బందులు పడుతుంటే ఏ కుమారుడు కూడా చూస్తూ ఊరుకోడు. ఆమె కష్టానికి గల కారణాన్ని తెలుసుకుని తల్లిని ఇబ్బందులకు గురి చేసిన వారి తాట తీస్తాడు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ యువకుడు.. తన తల్లి కష్టాన్ని చూడలేక దానికి కారణమైన అతని తండ్రినే అతి దారుణంగా హత్య చేశాడు. తాజాగా కర్ణాటకలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. కలకలం సృష్టించిన ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం రాయిచూర్ జిల్లా లింగసగూరు పరిధిలోని దేవరభూపర గ్రామంలో బండి తిమ్మన్న అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే గత కొంత కాలం నుంచి తిమ్మన్న తరుచు భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. భర్త ఇబ్బందులకు గురి చేస్తుండడంతో భార్య ఏడుస్తూ ఉండేది. తల్లి బాధను చూడలేని అతని కుమారుడు శిలవంత.. తండ్రికి అనేక సార్లు చెప్పి చూశాడు. కుమారుడి మాటను కూడా లెక్క చేయకుండా అలాగే భార్యను వేధింపులకు గురి చేస్తూ ఉండేవాడు. ఇక ఆదివారం కూడా తిమ్మన్న భార్యను ఇబ్బందులకు గురి చేశాడు. తట్టుకోలేకపోయిన కుమారుడు శిలవంత.. తండ్రి తిమ్మన్నను హత్య చేయాలని అనుకున్నాడు.

ఇందులో భాగంగానే కుమారుడు తండ్రితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే క్షణికావేశంలో ఊగిపోయిన శిలవంత.. రాళ్లతో కొట్టి తల్లి కళ్లముందే తండ్రిని రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఇక అతడు మరణించాడని తెలుసుకున్నాక శిలవంతకు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. చేసేదేం లేక స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తిమ్మన్న మృతదేహాన్నిపరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు శిలవంతను అరెస్ట్ చేశారు. విచారణలో పోలీసులు నిందితుడిని, అతడిని తల్లిని ప్రశ్నించగా.. రోజూ నా భర్త నన్ను వేధించేవాడని, నా కష్టాన్ని చూడలేకే కుమారుడు నా భర్తను హత్య చేశాడని తెలిపింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. తల్లి కన్నీళ్లకు కారణమైన అతని తండ్రిని దారుణంగా కొట్టి చంపిన కమారుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetStarzbetStarzbetJojobetjojobet güncel girişgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom