iDreamPost
android-app
ios-app

రక్తనాళాలు తెగి.. ప్రాణాలు పోయేలా 14 సార్లు కత్తితో పొడిచి

  • Published Apr 26, 2024 | 12:03 PM Updated Updated Apr 26, 2024 | 12:03 PM

Neha Hiremath: తాను ప్రేమించిన అమ్మాయి వేరే ఎవరికీ దక్కరాదన్న కోపంతో దారుణానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి.. ప్రాణాలు తీశాడు. ఆ వివరాలు..

Neha Hiremath: తాను ప్రేమించిన అమ్మాయి వేరే ఎవరికీ దక్కరాదన్న కోపంతో దారుణానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి.. ప్రాణాలు తీశాడు. ఆ వివరాలు..

  • Published Apr 26, 2024 | 12:03 PMUpdated Apr 26, 2024 | 12:03 PM
రక్తనాళాలు తెగి.. ప్రాణాలు పోయేలా 14 సార్లు కత్తితో పొడిచి

ఈమధ్య కాలంలో సమాజంలో చోటు చేసుకుంటున్న కొన్ని దారుణాలు చూస్తే.. మనకన్నా వేటాడే జంతువులే నయం కదా అనే భావన కలుగుతుంది. విచక్షణ లేని క్రూర మృగాల కన్నా దారుణంగా మనుషుల ప్రవర్తన రోజు రోజుకు దిగజారుతుంది. మరీ ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో మనుషుల్లోని క్రూరత్వం వెలుగులోకి వస్తుంది. ఎదుటి వ్యక్తి నో చెప్తే తట్టుకోలేకపోతున్నారు. తమకు దక్కని వారు.. మరి ఇక ఎవరికి దక్కకూడదనే ఉద్దేశంతో అత్యంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. ప్రేమను నిరాకరిస్తే.. దారుణాతి దారుణంగా ఎదుటి వ్యక్తి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు. ఇక కొన్ని రోజుల క్రితం కర్ణాటకలో ఈ తరహా దారుణం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

కాలేజీ ఆవరణలోనే.. తోటి విద్యార్థులు అందరూ చూస్తుండగానే.. అత్యంత దారుణంగా నేహా హిరేమఠ్‌ అనే విద్యార్థినిపై ఫయాజ్‌ అనే యువకుడు విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి.. అత్యంత క్రూరంగా హతమార్చిన సంగతి తెలిసిందే. లవ్‌ జిహాద్‌ కారణంగానే ఈ దారుణం చోటు చేసుకుంది అనే అనుమానాలు వ్యక్తం కాగా.. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక ఈ కేసు దర్యాప్తులో రోజు రోజుకు అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

కర్ణాటక, హూబ్లీలో ఈ దారుణం చోటు చేసుకుంది. నిందితుడు ఫయాజ్‌.. మృతురాలు నేహా హిరేమఠ్‌ను కాలేజీ ఆవరణలోనే అత్యంత దారుణంగా ఆమెను హత్య చేశాడు. ఈ నెల 18న మధ్యాహ్నం సమయంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. హత్య దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. నేహాను కత్తితో 9 సార్లు పొడిచినట్లు మొదట్లో అందరూ భావించారు. కానీ 14 సార్లు పొడిచినట్లుగా పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. గొంతుపై అనేకసార్లు పొడవడంతో రక్తనాళాలు తెగిపోయాయి. అంతేగాక గుండెల మీద కూడా పొడవడంతో మృతురాలు.. నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు వదిలింది.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం సీఐడీ అధికారులు ఫయాజ్‌ను కాలేజీకి తీసుకెళ్లి సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేశారు. హత్య జరిగి వారం రోజులు గడుస్తున్నా నిందితుడు ఫయాజ్‌ ముఖంలో కాస్త అయిన బాధ లేదని.. జరిగిన దారుణం పట్ల అతడిలో ఎలాంటి పశ్చాత్తాపం లేదని.. పైగా విచారణ సమయంలో ఎలాంటి భయం లేకుండా ఎంతో నిర్భీతిగా ఉన్నాడని సీఐడీ వర్గాలు తెలిపాయి.

ఇక తాను ప్రేమించిన అమ్మాయి వేరే ఎవరికీ దక్కరాదన్న అక్కసుతో హత్యకు పాల్పడ్డానని.. ఇక నేహాను చంపడం కోసం వాడిన కత్తిని హత్య చేయడానికి ఒకరోజు ముందు ధార్వాడలో కొనుగోలు చేసినట్లుగా వెల్లడించాడు ఫయాజ్‌. అంతేకాక కొన్నిరోజులుగా నేహా రాకపోకల మీద నిఘా వేశాడు. ఆ రోజు ప్రాక్టికల్‌ పరీక్షలు ఉండటంతో గంట ముందుగానే కాలేజీ క్యాంపస్‌లో కాపు కాసి… ఆమె కాలేజీకి రాగానే కత్తితో అత్యంత విచక్షణ రహితంగా దాడి చేసి ఆమెను అంతమొందించాడు.

gamdomCasibommarsbahis girişMarsbahisJojobet Giriş