iDreamPost
android-app
ios-app

భర్తకు విడాకులిచ్చి యజమానిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.. చివరికి!

  • Published Jul 05, 2023 | 6:18 PM Updated Updated Jul 05, 2023 | 6:18 PM
  • Published Jul 05, 2023 | 6:18 PMUpdated Jul 05, 2023 | 6:18 PM
భర్తకు విడాకులిచ్చి యజమానిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.. చివరికి!

ఈమెకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన చాలా కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే కొనసాగింది. అలా కొన్ని రోజులు గడిచింది. వివాహ అనంతరం ఈ మహిళ ఓ సంస్థలో ఉద్యోగానికి వెళ్లేది. అక్కడే ఆ సంస్థ యజమానితో ఈ మహిళ ప్రేమలో పడింది. ఈమెతో ప్రేమాయణానికి అతను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కట్ చేస్తే.. ఈ మహిళ భర్తకు విడాకులు ఇచ్చి ఆ తర్వాత తన ప్రియుడిని ప్రేమ పెళ్లి చేసుకుంది. అతనితోనైన సుఖంగా ఉందా అంటే అదీ లేదు. ఇంతకు ఆమె ఏం చేసిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకలోని హెగ్గనహళ్లిలో పవిత్ర (30) అనే వివాహిత నివాసం ఉంటుంది. ఆమెకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం తర్వాత ఈ మహిళ ఓ సంస్థలో ఉద్యోగానికి కుదిరింది. అయితే, ఈ సంస్థ యజమానితో పవిత్రకు మంచి సంబంధాన్ని ఏర్పరుచుకుంది. తరుచు అతనితో మాట్లాడడం, కలిసి భోజనం చేయడం చేసేది. అలా కొంతకాలానికి వీరిద్దరూ సన్నిహితంగా మెలిగారు. ఇక రాను రాను పవిత్ర ఆ సంస్థ యజమానితో ప్రేమలో పడింది.

ఇదే విషయాన్ని అతనికి చెప్పడంతో ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఇంకేముంది.. ఇద్దరూ ప్రేమ విహారంలో తేలియాడారు. అలా వీరి ప్రేమాయణం కొన్నేళ్లు గడిచింది. అయితే, పవిత్ర భర్తతో కన్న ప్రియుడితోనే ఉండాలని భావించింది. మొత్తానికి ఆ మహిళ భర్తకు విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత ప్రియుడిని ప్రేమ పెళ్లి చేసుకుంది. మరో విషయం ఏంటంటే? పవిత్ర ప్రియుడు ఆమెకు తెలియకుండా మరో యువతితో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు.

ఈ విషయం పవిత్రకు తెలియడంతో ఇద్దరు చాలా రోజుల నుంచి గొడవ పడుతూనే ఉన్నారు. ఇక దీంతో పాటు పవిత్ర పిల్లలు కనాలని భావిస్తే.. ఆమె భర్త మాత్రం దీనికి నిరాకరించాడట. దీంతో పవిత్ర తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇలాంటి బతుకు నాకు వద్దు అనుకుందో ఏమో కానీ.. పవిత్ర సోమవారం సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Jojobet GirişjojobetJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabet