iDreamPost
android-app
ios-app

మరికొన్ని రోజుల్లో వివాహం.. కన్నవాళ్ల మాటకి ఎదురు చెప్పలేక

  • Published Jul 04, 2024 | 2:18 PM Updated Updated Jul 04, 2024 | 2:18 PM

కుమార్తెకు పెళ్లి సంబంధం చూశారు.. మరి కొన్ని రోజుల్లో వివాహం. కానీ ఇంతలోనే దారుణం చోటు చేసుకుంది. కన్నవాళ్ల మాటకి ఎదురు చెప్పలేక ఆ యువతి ఏం చేసిందంటే..

కుమార్తెకు పెళ్లి సంబంధం చూశారు.. మరి కొన్ని రోజుల్లో వివాహం. కానీ ఇంతలోనే దారుణం చోటు చేసుకుంది. కన్నవాళ్ల మాటకి ఎదురు చెప్పలేక ఆ యువతి ఏం చేసిందంటే..

  • Published Jul 04, 2024 | 2:18 PMUpdated Jul 04, 2024 | 2:18 PM
మరికొన్ని రోజుల్లో వివాహం.. కన్నవాళ్ల మాటకి ఎదురు చెప్పలేక

పైన ఫొటోలో కనిపిస్తోన్న యువతిని చూశారా.. ఎంత అందంగా ఉందో అనిపించక మానదు. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క సంతానం. చదువు పూర్తి చేసింది. ఇంటి దగ్గర ఖాళీగా ఉండటం ఇష్టం లేక స్థానికంగా ఉన్న ఓ జిమ్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిలో చేరింది. జీవితం తనకు నచ్చినట్లు ఎంతో సంతోషంగా సాగుతుంది.. అనుకుంది. మరోవైపు యువతి తల్లిదండ్రులు.. ఆమె చదువు పూర్తి కావడంతో.. పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఓ సంబంధం కూడా చూశారు. మరి ఏం జరిగిందో తెలియదు కానీ.. యువతి దారుణ నిర్ణయం తీసుకుంది. ఆమె చేసిన పనికి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. పెళ్లి చేసి అత్తారింటికి పంపించాల్సిన బిడ్డను.. కాటికి పంపాల్సి వచ్చిందే అంటూ కన్నీరు పెడుతున్నారు. ఆ వివరాలు..

జిమ్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఈ విషాదకర సంఘటన కర్ణాటక, బాగలకుంట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దావణగెరెకి చెందిన మల్లనగౌడ, జ్యోతి దంపతులకు శ్రావణి(22) అనే కుమార్తె ఉంది. చదువు పూర్తి కావడంతో.. స్థానికంగా ఉన్న జిమ్‌లో రిసెప్షనిస్ట్‌గా పని చేస్తోంది.

దాసరహళ్లిలో ఉంటూ బాగలకుంట పరిధిలోని గోల్డెన్‌ జిమ్‌లో రిసెప్షనిస్ట్‌ ఉద్యోగంలో జాయిన్‌ అయ్యింది. చదువు అయిపోయింది.. ఉద్యోగం కూడా చేస్తోంది. దాంతో తల్లిదండ్రులు శ్రావణికి పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. ఓ సంబంధం కూడా కుదిరింది. మరికొన్ని రోజుల్లో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. మరి ఏం జరిగిందో తెలియదు కానీ.. రోజులాగే పనికి వెళ్లిన శ్రావణి హఠాత్తుగా కూర్చున్న చోటే వాంతులు చేసుకుని అస్వస్థతకు గురై కుప్పకూలింది.

శ్రావణి కింద పడటం గమనించిన జిమ్‌ సిబ్బంది వెంటనే స్పందించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ లాభం లేకుండాపోయింది. అప్పటికే ఆమె మృతి చెందింది. పెళ్లి చేసి అ‍త్తారింటికి పంపుదామని ఆశపడిన తల్లిదండ్రలు కుమార్తె మరణ విర్త విన్న ఒక్కసారిగా కుప్పకూలారు. గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. అయితే శ్రావణికి తల్లిదండ్రులు చూసిన సంబంధం ఇష్టం లేదని తెలుస్తోంది.

శ్రావణి.. శంకర్‌ అనే ఓ యువకుడిని ప్రేమిస్తోందని సమాచారం. కుమార్తె ప్రేమ విషయం తెలుసుకున్న శ్రావణి తల్లిదండ్రులు ఆమెని పెళ్లికి ఒప్పించడం కోసం.. ఇటీవల బెంగళూరు వచ్చారు. అయితే వివాహం చేసుకోవడం ఇష్టం లేని శ్రావణి చివరిసారిగా ప్రియుడికి ఫోన్‌ చేసి విషయం చెప్పింది. అప్పటికే ఆమె విషం తాగింది. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetparktimebetjojobet girişslot siteleriMadridbetMadridbetmadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetlunabetgrandpashabetcasibomcasibomjojobetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabet giriş