iDreamPost
android-app
ios-app

డెంటల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతోంది.. అర్థరాత్రి హాస్టల్ భవనం ఎక్కి..!

  • Published Sep 02, 2023 | 12:19 PM Updated Updated Sep 02, 2023 | 12:19 PM
  • Published Sep 02, 2023 | 12:19 PMUpdated Sep 02, 2023 | 12:19 PM
డెంటల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతోంది.. అర్థరాత్రి హాస్టల్ భవనం ఎక్కి..!

ఈ అమ్మాయి పేరు పద్మావతి, వయసు 23 ఏళ్లు. పుట్టి పెరిగిందంతా బెంగుళూరులోనే. ఇక చిన్నప్పటి నుంచి ఈ యువతికి చదువంటే ఎంతో ఇష్టం. బాగా చదువుకుని జీవితంలో మంచిగా స్థిరపడి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అనుకుంది. ఇందులో బాగంగానే ఈ అమ్మాయి బళ్లారిలోని విమ్స్ ఆవరణలో ఉన్న ఓ ప్రభుత్వ దంత కళాశాలలో చేరింది. ఇక్కడే చదువుకుంటూ హాస్టల్లో ఉండేది. ఇక అంతా బాగానే ఉందనుకున్న తరుణంలోనే ఈ యువతి ఇటీవల అర్థరాత్రి అందరూ పడుకున్నాక హాస్టల్ పై భవనం ఎక్కి ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. పద్మావతి (23) అనే ఈ యువతి బెంగుళూరులోని ఓ ప్రాంతంలో పుట్టి పెరిగింది. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి బాగా చదివించారు. కాగా, ఈ అమ్మాయి బళ్లారిలోని విమ్స్ పరిధిలో ఉన్న ఓ ప్రభుత్వ దంతవైద్య కళాశాలలో చదువుకుంటోంది. ఇక బాగా చదువుకుని వైద్య వృత్తిలో కొనసాగాలని అనుకుంది. కాగా, ఈ యువతి కొన్నాళ్ల నుంచి కాలేజీ సమీపంలోని ఓ హాస్టల్ లో తన తల్లితో పాటే కలిసి ఉంటుంది. ఇదిలా ఉంటే.. గత కొంత కాలం నుంచి కృంగిపోయినట్లు తెలుస్తోంది.

అయితే ఈ క్రమంలోనే ఏం జరిగిందో ఏమో కానీ.. శుక్రవారం రాత్రి పద్మావతి తన తల్లిని కొబ్బరి బోండా తీసుకురమ్మని బయటకు పంపింది. దీంతో తల్లి బయటకు వెళ్లింది. అప్పటికే అర్థరాత్రి దాటింది. ఇక ఇదే మంచి సమయం అనుకున్న ఈ యువతి హాస్టల్ భవనం ఎక్కి అక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక తల్లి హాస్టల్ కు వచ్చి చూడగా రూమ్ లో కూతురు కనిపించలేదు. అటు ఇటు అంతటా వెతికింది. కానీ, ఎక్కడా కూడా కూతురి జాడ కనిపించలేదు. ఇదే సమయంలో హాస్టల్ ముందు కింద పడి కుమార్తె శవమై కనిపించింది.

కూతురిని తల్లి అలా చూసి గుండెలు పగిలేలా ఏడ్చింది. అనంతరం అందరూ అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

Jojobet Girişjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes Belgique