iDreamPost
android-app
ios-app

ఇన్సురెన్స్‌ డబ్బులకోసం బరి తెగించిన తల్లి.. పాపం కూతుర్ని!

ఇన్సురెన్స్‌ డబ్బులకోసం బరి తెగించిన తల్లి.. పాపం కూతుర్ని!

 ఇన్సురెన్స్‌ డబ్బుల కోసం ఓ తల్లి దారుణానికి తెగించింది. కన్న బిడ్డపై అత్యంత పాశవికమైన చర్యలకు పాల్పడింది. ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు ప్రతీ నిత్యం కూతురికి నరకం చూపించింది. దీంతో ఆ కూతురు ఏకంగా 43 సార్లు ఆసుపత్రి పాలైంది. ఆ కసాయి తల్లి చివరకు పాపం పండి జైలు పాలైంది. ఈ సంఘటన జపాన్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ పూర్తి వివరాల్లోకి వెళితే.. జపాన్‌లోని ఒసాకకు చెందిన కసుమి నవటకు ఓ చిన్న పాప ఉంది. కసుమి ఇన్సురెన్స్‌ డబ్బుల కోసం ఆ పాపపై దారుణానికి తెగించింది. తన బిడ్డను తరచుగా ఇబ్బందులకు గురి చేసేది.

తిండి కూడా సరిగా పెట్టేది కాదు. ఆరోగ్యం బాగానే ఉన్నా లేని పోని మందులు మింగించేది. దీంతో చిన్నారి తరచుగా అనారోగ్యం బారిన పడేది. అప్పుడు బాలికను తీసుకుని ఆసుపత్రికి వెళ్లేది. ఆసుపత్రిలో చేర్చిన తర్వాత ఇన్సురెన్స్‌ డబ్బులు క్లైమ్‌ చేసుకునేది. ఇలా ఒకసారి కాదు.. రెండు సార్లు కాదు.. ఏకంగా 40 సార్లకుపైనే ఇన్సురెన్స్‌ డబ్బులకోసం కూతుర్ని ఆసుపత్రి పాలు చేసింది. 2018నుంచి ఇప్పటి వరకు 43 సార్లు కూతుర్ని హింసించి మరీ ఆస్పత్రిలో చేర్చింది.

అలా మొత్తం 33 లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంది. అయితే, కసుమి తరచుగా కూతుర్ని ఆస్పత్రికి తీసుకువస్తుండటంతో ఆస్పత్రి వైద్యులకు అనుమానం వచ్చింది. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో కసుమి ఘోరాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. కసుమి దుశ్చర్యల కారణంగా ఆమె కూతురు పలు వ్యాధుల బారిన పడ్డట్టు పోలీసులు గుర్తించారు. తర్వాత కసుమిని అరెస్ట్‌ చేశారు. మరి, ఈ కసాయి తల్లి ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.