iDreamPost
android-app
ios-app

లవ్‌ చేసిందని కూతుర్ని చంపిన తల్లికి జైలు

  • Published Mar 21, 2024 | 10:45 AM Updated Updated Mar 21, 2024 | 10:54 AM

ప్రేమ వ్యవహారాలు ఘోరాలు చోటుచేసుకుంటాయి. రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లాలో పరువు హత్య కలకలంరేపింది. ఎన్ని సార్లు హెచ్చరించినా వద్దన్నా వాడినే ప్రేమించిందన్న కోపంతో కూతురును కొట్టిచంపింది కన్న తల్లి. తాజాగా ఆ తల్లికి జైలు శిక్ష పడింది.

ప్రేమ వ్యవహారాలు ఘోరాలు చోటుచేసుకుంటాయి. రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లాలో పరువు హత్య కలకలంరేపింది. ఎన్ని సార్లు హెచ్చరించినా వద్దన్నా వాడినే ప్రేమించిందన్న కోపంతో కూతురును కొట్టిచంపింది కన్న తల్లి. తాజాగా ఆ తల్లికి జైలు శిక్ష పడింది.

  • Published Mar 21, 2024 | 10:45 AMUpdated Mar 21, 2024 | 10:54 AM
లవ్‌ చేసిందని కూతుర్ని చంపిన తల్లికి జైలు

రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం  దండుమైలారంలో భార్గవి(19) అనే యువతిని.. ఆమె తల్లి చంపిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసింది. వేరే వ్యక్తిని ప్రేమించిన భార్గవికి.. బావను పెళ్లి చేసుకోవాలని ఆమె తల్లిదండ్రులు ఒత్తిడి చేశారు. ఇది ఆమెకు నచ్చలేదు. ఈ క్రమంలోనే భార్గవి తన ప్రియుడు శశిని ఇంటికి పిలిచి మాట్లాడుతుండగా..తల్లి జంగమ్మ చూసింది. కోపంతో కూతురిని కొట్టి చీరతో  ఉరేసి చంపేసింది. మృతురాలి సోదురుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జంగమ్మను అరెస్ట్ చేశారు. తాజాగా  నిందితురాలి రిమాండ్ విధించారు.

ప్రేమ కారణంగా జరుగుతున్న ఘోరాలు చాలానే ఉన్నాయి. ఈ  లవ్ ఎఫైర్స్ లో భాగంగా పరువు హత్యలు జరుగుతున్నాయి. ఈ ప్రేమ వ్యవహారాల కారణంగా కంటికి రెప్పలాగా చూసుకున్న బిడ్డలను సైతం తల్లిదండ్రుల దారుణంగా హతమారుస్తున్నారు. సమాజంలో పరువు పోతుందనే కారణంతో కొందరు పేరెంట్స్ తమ బిడ్డలను చంపేందుకు కూడా వెనుకాడటం లేదు. ఇలా పేగు తెంచుకుని పుట్టిన బిడ్డలను ప్రేమలో ఉన్నారని క్షణికావేశంలో చంపేసి చివరకు జైలు పాలవుతున్నారు. రెండు రోజుల క్రితం అలాంటి ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నంలో చోటుచేసుకుంది.  వద్దన్నా వాడినే ప్రేమించిందన్న కోపంతో కూతురును కొట్టి చంపింది తల్లి.

రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలో పరువు హత్య తీవ్ర కలకలం రేపింది. ఇబ్రహీం పట్నం  మండలం దండుమైలారంలో నివాసముంటున్న మోతే జంగమ్మ, ఐలయ్యలకు ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరు కుమారులు కాగా, ఒక కుమార్తె ఉంది. ఈమె దిల్ సుఖ్ నగర్‌లోని అనిబీసెంట్ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో చదువుకుంటుంది. ఈ క్రమంలో భార్గవి అదే గ్రామానికి చెందిన శశి అనే యువకుడిని ప్రేమించింది. ఈ విషయం కాస్త భార్గవి  పేరెంట్స్ కి  తెలిసింది. మరోసారి ఇలాంటివి చేయోద్దని వారు భార్గవిని మందలించి కాలేజీ మాన్పించారు. తమ పరువు కాపాడుకోవాలంటే కూతురుకు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

వెంటనే వాళ్ల చుట్టాల అమ్మాయితో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. అయినా భార్గవిలో మార్పు రాలేదు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ప్రియుడైన శశిని ఇంటికి పిలిపించుకుంది భార్గవి. ఏకాంతంగా మాట్లాడుకుంటున్న సమయంలో భార్గవి తల్లి జంగమ్మ చూసింది. వారిపై కోపంతో రగిలిపోయింది. ఎన్ని సార్లు చెప్పినా మారడం లేదని కూతురును కన్న తల్లే కొట్టి చంపింది. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కానీ మృతురాలి సోదరుడు చరణ్ తన తల్లే చంపిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చివరకు బిడ్డను హత్య చేసిన జంగమ్మను పోలీసులు రిమాండ్ కి తరలించారు. మరి.. మొత్తంగా ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss