iDreamPost
android-app
ios-app

జగిత్యాల జిల్లాలో దారుణం.. ఇంటికొచ్చిన అల్లుడిపై..!

  • Published Oct 12, 2023 | 1:13 PM Updated Updated Oct 12, 2023 | 1:13 PM
  • Published Oct 12, 2023 | 1:13 PMUpdated Oct 12, 2023 | 1:13 PM
జగిత్యాల జిల్లాలో దారుణం.. ఇంటికొచ్చిన అల్లుడిపై..!

తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇంటికొచ్చిన అల్లుడిపై అత్తింటి కుటుంబ సభ్యులు కత్తితో పొడిచారని తెలుస్తుంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. బాధితుడి తండ్రి కథనం ప్రకారం.. జిల్లాలోని ఇందిరానగర్ కు చెందిన ఓ యువతితో గజ్జెల సాయి కుమార్ కు మూడేళ్ల కిందట వివాహం జరిగింది. అప్పటి నుంచి ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల పెత్తరమాస కావడంతో పెద్దలకు బియ్యం ఇవ్వాలని అతని భార్యతో కలిసి సాయి కుమార్ అత్తింటికి వెళ్లాడు.

కార్యక్రమం ముగిసిన తర్వాత.. అదే రోజు రాత్రి తిరిగి ఇంటికి రావాలని భార్యను కోరాడు. భార్య మాత్రం రానని చెప్పినట్లు సమాచారం. ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే అత్తింటి కుటుంబ సభ్యులు సాయి కుమార్ ను కత్తితో పొడిచారు. వెంటనే అతడి కుటుంబ సభ్యులు అప్రమత్తమై సాయి కుమార్ ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు.

ఈ ఘటనపై సాయి కుమార్ కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని ఆస్పత్రిలో ఉన్న బాధితుడిని పరిశీలించారు. ఈ సందర్భంగా సాయి కుమార్ తండ్రి మాట్లాడుతూ.. ఇటీవల సాయి కుమార్ అతని భార్యతో కలిసి అత్తింటికి వెళ్లాడు. భార్య తిరిగి ఇంటికి రానని చెప్పడంతో భార్యాభర్తలు గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే సాయి కుమార్ పై అతని బావ మరిది, ఇతర కుటుంబ సభ్యులు సాయి కుమార్ పై కత్తితో పొడిచారని తెలిపాడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet