iDreamPost
android-app
ios-app

తండ్రి, తమ్ముడ్ని చంపి.. ప్రియుడితో కలిసి.. ఈ మైనర్ చేసిన పనికి నోరెళ్లబెడతారు!

  • Published May 31, 2024 | 10:08 PM Updated Updated May 31, 2024 | 10:08 PM

ఆమె మైనర్ బాలిక. ఓ యువకుడ్ని ప్రేమించింది. ఈ విషయం తండ్రికి తెలిసింది. నీ వయస్సు ఎంత.. నీకు ప్రేమ, దోమ కావాల్సి వచ్చిందా అంటూ తండ్రి మందలించాడు. అంతే

ఆమె మైనర్ బాలిక. ఓ యువకుడ్ని ప్రేమించింది. ఈ విషయం తండ్రికి తెలిసింది. నీ వయస్సు ఎంత.. నీకు ప్రేమ, దోమ కావాల్సి వచ్చిందా అంటూ తండ్రి మందలించాడు. అంతే

  • Published May 31, 2024 | 10:08 PMUpdated May 31, 2024 | 10:08 PM
తండ్రి, తమ్ముడ్ని చంపి.. ప్రియుడితో కలిసి.. ఈ మైనర్ చేసిన పనికి నోరెళ్లబెడతారు!

చదువుకోవాల్సిన వయస్సులో ప్రేమ, దోమ అంటున్నారు మైనర్స్. సినిమాల ప్రభావానికి తోడు, సమాజంలో చోటుచేసుకుంటున్న పరిణామాలకు వీరు త్వరగా ఎడిక్ట్ అయిపోతున్నారు. దీంతో లేత వయస్సులోనే ఘాటు వ్యవహారాలు చేస్తున్నారు. ఇన్ ఫాక్చుయేషన్, ప్రేమకు అర్థం తెలియకుండా.. పై పై మెరుగులు చూసి మోసపోతున్నారు. ఎర్రగా, బుర్రగా ఉందని అమ్మాయిల్ని వల వేస్తున్నారు అబ్బాయిలు. తాజాగా ఓ మైనర్ ప్రేమ మత్తులో.. ఇద్దరు ప్రాణాలను బలి తీసుకుంది. ప్రియుడి సాయంతో తండ్రిని, తమ్ముడ్ని హత్య చేసి పారిపోయింది. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్ పూర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన యావత్ భారత్ సంచలనంగా మారింది. ఇంతకు ఏం జరిగిందంటే..?

జబల్ పూర్‌లో నివాసం ఉంటుంది రాజ్ కుమార్ విశ్వకర్మ కుటుంబం. అతడికి కూతురు, కొడుకు ఉన్నారు. మైనర్ అయిన కూతురు.. ముకుల్ అనే యువకుడి ప్రేమలో పడింది. ఈ విషయం తండ్రికి తెలిసి మందలించాడు. దీంతో తమ ప్రేమను తండ్రి ఒప్పుకోకపోవడంతో హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. తొలుత విశ్వకర్మను చంపేసింది ఈ జంట. ఆ సమయంలో ఈ హత్యను మైనర్ తమ్ముడు చూడటంతో.. అతడిని కూడా చంపేశారు. అనంతరం వీరి మృతదేహాలను ముక్కలు ముక్కలు కోయాలని నిర్ణయించారు. అయితే వీలు కాకపోవడంతో.. ఇంట్లో కొంత డబ్బు తీసుకుని పరారయ్యారు. పారిపోయే ముందు తన అత్తకు ఫోన్ చేసి, ముకుల్ నాన్న, తమ్ముడిని చంపేశాడు అని చెప్పింది మైనర్ బాలిక.

షాక్ తిన్న కుటుంబ సభ్యులు.. ఇంటికి వెళ్లి చూడగా.. రక్తపు మడుగుల్లో ఉన్న మృతదేహాలు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. వీరిద్దరు పోలీసుల నుండి తప్పించుకునేందుకు 8 రాష్ట్రాల్లో పర్యటించారు. మార్చి 15న హత్య చేసి.. అప్పటి నుండి పరారీలో ఉన్నారు ఈ ప్రేమికులు. వారి వద్ద డబ్బు అయిపోయిన తర్వాత ఇద్దరు హరిద్వార్ ఆశ్రమంలో ఆశ్రయం పొందారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మే 29న హరిద్వార్ నుంచి మైనర్ బాలికను పోలీసులు అరెస్ట్ చేయగా, దీంతో భయపడిపోయిన ముకుల్ పోలీసుల ముందు లొంగిపోయాడు. బాలిక ప్రియుడు ముకుల్ స్వయంగా పోలీసులు ముందు లొంగిపోవడంతో అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. అతడు నేరాన్ని అంగీకరించడంతో ఎస్పీ ఆదిత్య ప్రతాప్ సింగ్ శుక్రవారం విలేకరులు సమావేశం నిర్వహించారు. ఈ నేరంలో లవర్స్ ఇద్దరు భాగస్వామ్యులేనని తెలిపారు.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet