మద్యం దుకాణాల్లో నోట్ల కట్టలు.. ఇంత డబ్బు ఎక్కడిది..?

ఎవరిపైనైనా ఆర్థికపరమైన అవినీతి ఆరోపణలు ఎదురైతే.. ఆదాయపు పన్ను శాఖ సోదాలు చేపడుతూ ఉంటుంది. ఈ సోదాల్లో బ్లాక్ మనీ, లెక్కల్లో లేని ఆస్తి, డబ్బులను స్వాధీనం చేసుకుంటారు. డబ్బులను లెక్కించేందుకు కౌంటింగ్ మిషన్లు వాడుతుంటారు.. కానీ

ఎవరిపైనైనా ఆర్థికపరమైన అవినీతి ఆరోపణలు ఎదురైతే.. ఆదాయపు పన్ను శాఖ సోదాలు చేపడుతూ ఉంటుంది. ఈ సోదాల్లో బ్లాక్ మనీ, లెక్కల్లో లేని ఆస్తి, డబ్బులను స్వాధీనం చేసుకుంటారు. డబ్బులను లెక్కించేందుకు కౌంటింగ్ మిషన్లు వాడుతుంటారు.. కానీ

అవినీతి ఆరోపణలు, ఆదాయానికి మించిన ఆస్తులు, అక్రమ ఆర్థిక లావాదేవీలు, పన్ను ఎగవేతలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేపడుతుంటారు. ఈ సమయంలో గుట్టలు గుట్టలుగా బ్లాక్ మనీ, బంగారం, వజ్రాలు, ప్రభుత్వ లెక్కల్లోకి రాని ఆస్తులు అనేకం బయటపడుతుంటాయి. అలాగే కొన్ని ఖరీదైన వస్తువులను కూడా స్వాధీనం చేసుకుంటూ ఉంటారు. నగదును తమ వెంట తెచ్చిన కౌంటింగ్ మిషన్లలో లెక్కగడుతూ ఉంటారు. కానీ ఆ మిషన్లకే సవాలుగా విసిరేంత మనీ దొరికితే ఏమనుకోవాలి.. వాటిని లెక్కించడానికి అధికారులు తలలు పట్టుకుంటే.. అదే జరిగింది ఇటీవల చేపట్టిన సోదాల్లో. పలు కంపెనీలపై పన్ను ఎగవేత ఆరోపణలు రావడంతో సోదాలు నిర్వహించగా.. అంత డబ్బు చూసి ఆఫీసర్లే కళ్లు తేలేశారట.

ఇటీవల రెండు మద్యం తయారీ కంపెనీలపై పన్ను ఎగవేత ఆరోపణలు రాగా, ఒడిశా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. రెండు రోజుల పాటు చేపట్టిన ఆ సోదాల్లో కోట్లాది రూపాయాల నోట్ల కట్టలు బయటపడ్డాయి. అంత డబ్బు చూసి షాక్ తిన్నారట అధికారులు. మిషన్లు పెట్టి లెక్కిద్దామని చూస్తే.. మిషన్లు కూడా మొరాయించేశాయి. రెండు రోజులు లెక్కించే అంత నగదు అట అది. వివరాల్లోకి వెళితే..ఒడిశాలోని బోలంగీర్, సంబల్ పూర్,ఝార్జండ్‌లోని రాంచీ, లోహర్ దగా ప్రాంతాల్లోని మద్యం తయారీ కంపెనీల్లో బుధవారం ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. మద్యం కంపెనీకి చెందిన కార్యాలయాలు, నివాసాల్లో, ప్రాంగణాల్లో సోదాలు చేపట్టారు. ఈ క్రమంలోనే బీరువాలో కుక్కిన నోట్ల కట్లను చూసి నోర్లు వెళ్లబెట్టారట.

బౌధ్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీల్లో  చేపట్టిన ఈ సోదాల్లో భారీ మొత్తంలో దాచిన నగదు చూసి ఖంగుతిన్న అధికారులు.. నగదు లెక్కించే ప్రక్రియ మొదలు పెట్టారు. కౌంటింగ్ మిషన్లతో లెక్కపెట్టడం స్టార్ చేయగా.. కొంత సేపటికీ ఆ మిషన్లు సైతం మొరాయించాయి. రూ. 50 కోట్ల నగదును లెక్కించే సరికి.. అవి కూడా పనిచేయడం ఆగిపోయాయి.ఈ రెండు రోజుల్లో సుమారు రూ. 150 కోట్ల రూపాయల నగదును ఐటీ శాఖ అధికారులు సీజ్ చేశారు. ఇదంతా లెక్కించడానికి మరిన్ని మిషన్లను తీసుకువస్తున్నారు. గురువారం కూడా ఆ డబ్బును లెక్కించనున్నారట అధికారులు. అయితే వీటిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇంత డబ్బు ఎక్కడిదో పోలీసులకు, ఐటీ అధికారులకు అంతు చిక్కలేదు. ఇంత పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు కనిపిస్తే.. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments