Krishna Kowshik
పాల ఉత్పత్తిలో ఆ కంపెనీ నంబర్ వన్. పాల ఉత్పత్తితో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. మామ సహకారంతో కంపెనీ ఏర్పాటు చేశాడు అల్లుడు. కానీ అనూహ్యంగా ఇటీవల మరణించాడు. దీంతో..
పాల ఉత్పత్తిలో ఆ కంపెనీ నంబర్ వన్. పాల ఉత్పత్తితో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. మామ సహకారంతో కంపెనీ ఏర్పాటు చేశాడు అల్లుడు. కానీ అనూహ్యంగా ఇటీవల మరణించాడు. దీంతో..
Krishna Kowshik
ఈ మధ్య కాలంలో సినిమాల ప్రభావమో లేక ఊహో తెలియదు కానీ.. చేతబడులు, బ్లాక్ మ్యాజిక్ ఉన్నాయి అంటూ బలంగా నమ్ముతున్నారు. శాస్త్ర, సాంకేతికంగా ముందుకు దూసుకెళుతుంటే.. మానవుడు వెనక్కు నడుస్తున్నాడన్న సందేహం కలుగుతుంది. తమపై బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారని, క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ వాపోతున్నారు కొందరు. వీటిని బలంగా నమ్ముతున్నవారు కూడా ఉన్నారు. విద్యా వంతులు సైతం ఇటువంటి ఆరోపణలు చేస్తుండటం గమనార్హం. తాజాగా ఓ వ్యాపార వేత్త కూతురు ఇదే ఆరోపణలతో పోలీసులను ఆశ్రయించింది. ఆస్తి విషయంలో తమ కుటుంబంపై చేతబడి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ఇంతకు ఆమె ఎవరంటే.. ప్రముఖ వ్యాపార వేత్త డాక్టర్ విజయ సంకేశ్వర్ కూతురు దీపా సిద్నాల్.
కర్ణాటకలోని ప్రముఖ వ్యాపార వేత్తల్లో ఒకరు విజయ్ సంకేశ్వర్. వీఆర్ఎల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్. ఆయన రెండో కూతురే ఈ దీప. ఆమెకు విజయకాంత డెయిరీ మిల్క్ వ్యవస్థాపకుడు శివకాంత సిద్నాల్‌తో వివాహం అయ్యింది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె. అయితే ఇటీవల ఆమె భర్త చనిపోయాడు. అనారోగ్య సమస్యలతో ఈ ఏడాది ఏప్రిల్‌లో మరణించాడు. అయితే ఆస్తి కోసం చేతబడి చేస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించింది ఆయన భార్య దీప. విజయకాంత డెయిరీ మిల్క్ ఆస్తి కోసం ఈ చర్యకు పాల్పడ్డారని పేర్కొంది. విజయ సంకేశ్వర్, శివకాంత సిద్నా భాగస్వామ్యంతో విజయకాంత మిల్క్ డెయిరీని ప్రారంభించారు. ఈ డెయిరీ ప్రారంభం అయ్యాక.. కర్ణాటకలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. అతడి మరణం తర్వాత కంపెనీ బాధ్యతలను చేపడుతుంది సిద్నాల్ కుటుంబం.
అయితే తాజాగా తన భర్త శివకాంత సమాధి దగ్గర చేతబడి చేశారని ఆరోపిస్తూ పోలీసులకు వెళ్లింది. ఎఫ్ఐఆర్‌లో శివకాంత సోదరుడు శశికాంత సిద్నాల్, భార్య వాణి సిద్నాల్, అతడి కుమారుడు దిగ్విజయ సిద్నాల్‌పై బ్లాక్ మ్యాజిక్ ఆరోపణలు చేసింది. బెల్గాంలోని క్యాంప్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఐపిసి 1860, సెక్షన్ 120బి, 506, 307, బ్లాక్ మ్యాజిక్ యాక్ట్ 2007 కింద ఫిర్యాదు చేశారు. 2002లో శివకాంత సిద్నాలతో దీపకు వివాహం జరిగింది. 2006లో విజయకాంత డెయిరీని స్థాపించి పాల ఉత్పత్తిని చేస్తున్నారు. ఇక్కడ ఈ సంస్థకు పెద్ద పేరు ఉంది. ఇప్పుడే ఈ ఫ్యాక్టరీని హస్తగతం చేసుకునేందుకు తమ బంధువులు ప్రయత్నిస్తున్నారని, క్షుద్ర పూజలు చేస్తున్నారని పేర్కొంటూ దీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అయితే దీనిపై చర్యలు ఏమన్నా తీసుకున్నారన్నది తెలియరాలేదు.