iDreamPost
android-app
ios-app

చూడటానికి చదువుకున్న వ్యక్తిలా ఉన్నారు.. ఇదేం పోయే కాలం!

చూడటానికి అమయకంగా కనిపిస్తుంది కదా అని ఎవరూ జాలి పడకండి. అవును, ఈ మాయలేడి ఏం చేసిందో తెలిస్తే షాక్ కు గురవుతారు. ఇంతకు ఏం చేసిందంటే?

చూడటానికి అమయకంగా కనిపిస్తుంది కదా అని ఎవరూ జాలి పడకండి. అవును, ఈ మాయలేడి ఏం చేసిందో తెలిస్తే షాక్ కు గురవుతారు. ఇంతకు ఏం చేసిందంటే?

చూడటానికి చదువుకున్న వ్యక్తిలా ఉన్నారు.. ఇదేం పోయే కాలం!

పైన ఫొటోలో కనిపిస్తున్న ఈ మహిళ హైదరాబాద్ నగరంలోని ఓ ప్రాంతంలో నివాసం ఉంటుంది. అయితే, ఈమె అందరిలా కష్టపడకుండా ఈజీగా ఎలా డబ్బు సంపాదించాలని అనుకుంది. ఇందుకోసం ఆమె వేయని ఎత్తుగడలు లేవనే చెప్పాలి. ఇక ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి చేతులు కాల్చుకుంది. దీంతో ఈ మహిళకు ఏం చేయాలో తెలియలేదు. ఇక చేసేదేంలేక ఇటీవల షాకింగ్ డెసిషన్ తీసుకుంది. అనుకున్నట్లే చేయాల్సిన పని చేసి అందరినీ షాక్ కు గురి చేసింది. అసలు విషయం వెలుగులోకి రావడంతో ఆ మాయలేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

పోలీసుల కథనం ప్రకారం.. ఈ మధ్యకాలంలో కొందరు డబ్బుల కోసం ఎంతకైన తెగిస్తున్నారు. చెమటోడ్చి పైసలు సంపాదించకుండా మోసం చేస్తూ తెలివిగా సొమ్మును కూడ బెడుతున్నారు. ఈ లీస్టులోకి మహిళలు కూడా చేరిపోయారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ మహిళ ఊహించని దారుణానికి పాల్పడింది. ఇటీవల హైదరాబాద్ లోని హబ్సిగూడలో నగలు కొనేందుకు కనేందుకు అని సిబ్బందిని నమ్బించి ఓ ప్రముఖ జ్యూవెల్లరీ షాపులోకి వెళ్లింది. ఇక షాపు మొత్తం కలియ తిరిగింది. అందరి మాదిరిగానే నగలను పట్టి పట్టి చూసింది. కొనుగోలు చేస్తున్న సిబ్బందిని నమ్మించింది. ఈ క్రమంలోనే ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. ఇదే మంచి సమయం అని భావించిన ఈ మాయ లేడీ వచ్చిన పని కానిచ్చింది.

మెల్లగా అక్కడున్న సిబ్బంది కళ్లుగప్పి.. తన వెంట తెచ్చుకున్న నగలను అక్కడ ఉంచి.., ఒరిజినల్ బంగారు అభరణాలను అపహరించింది. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా మెల్లగా అక్కడి నుంచి పరారైంది. అయితే, డ్యూటీలో ఉన్న సిబ్బందికి కాస్త అనుమానం రావడంతో షాపు యాజమాన్యానికి సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ షొరూమ్ లో ఉన్న అన్ని సీసీ కెమెరాలను పరిశీలించగా ఆ మహిళ చేసిన చోరీ ఘటన వెలుగు చూసింది. తన వెంట తెచ్చుకున్న నగలను అక్కడ పెట్టి ఒరిజనల్ బంగారు అభరణాలను చోరీ చేసింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఆ మహిళను గుర్తించి తాజాగా అరెస్ట్ చేశారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఈ వార్త తెలుసుకున్న కొందరు నెటిజన్స్.. చూడటానికి చదువుకున్న వ్యక్తిలా ఉన్నారు.. ఇదేం పోయే కాలం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.