iDreamPost
android-app
ios-app

Hyderabad: ప్రేమ వివాహం.. కానీ ఆ భయంతో వారి జీవితాలు

  • Published Jun 09, 2024 | 11:03 AM Updated Updated Jun 09, 2024 | 11:03 AM

వారిది ప్రేమ వివాహం.. కలకాలం కలిసి ఉండాలని బాసచేసి పెళ్లి చేసుకున్నారు.. కొన్నాళ్ల పాటు వారి కాపురం సాఫీగానే సాగింది. కానీ ఇంతలోనే

వారిది ప్రేమ వివాహం.. కలకాలం కలిసి ఉండాలని బాసచేసి పెళ్లి చేసుకున్నారు.. కొన్నాళ్ల పాటు వారి కాపురం సాఫీగానే సాగింది. కానీ ఇంతలోనే

  • Published Jun 09, 2024 | 11:03 AMUpdated Jun 09, 2024 | 11:03 AM
Hyderabad: ప్రేమ వివాహం.. కానీ ఆ భయంతో వారి జీవితాలు

వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే.. జీవితాంతం ఒకరి చేయి ఒకరు విడివకూడదని బాసలు చేసుకున్నారు. కష్టాలెన్ని వచ్చినా.. కలిసే ఉండాలని భావించారు. అనుకున్నట్లుగానే ఇద్దరూ చెరో పని చేసుకుంటూ.. సంతోషంగా జీవిస్తున్నారు. మరి ఏం జరిగిందో తెలియదు.. వారిని ఎలాంటి భయాలు వెంటాడాయో తెలియదు.. దారుణ నిర్ణయం తీసుకున్నారు. పట్టుమని పాతికేళ్లు కూడా నిండకముందే.. భయనాక నిర్ణయం తీసుకున్నారు. కలిసి మెలిసి జీవించాలని బాసలు చేసుకున్న వారు.. వాటిని నిలుపుకోలేక పోయారు. కలిసి బతకలేమని భావించని వారు.. కలిసే చనిపోవాలని భావించారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఆ వివరాలు..

ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు.. జీవితాంతం కలిసి ఉండాలని బాసలు చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు వారి కాపురం సజావుగా సాగింది. మరి ఏం జరిగిందో తెలియదు.. ఒకే రోజు భార్యాభర్తలిద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ సంఘటన జీడిమెట్ట.. జగద్గిరిగుట్ట, గాజులరామారంలో చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలోని హెచ్‌ఏఎల్‌ కాలనీకి చెందిన కృష్ణమూర్తి.. చిన్న కొడుకు మంచూరి రేశ్వంత్‌(26)కు అదే కాలనీకి చెందిన సాయిశ్రేయ(22)తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి.. వివాహం చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు దంపతులు ఇద్దరూ బాగానే ఉన్నారు.

పెళ్లి తర్వాత వీరు గాజులరామారం, ద్వారకా నగర్‌లో కాపురం పెట్టారు. ఇక రేశ్వంత్‌ బిగ్‌ బాస్కెట్‌లో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. కొన్నాళ్ల పాటు వీరు సంతోషంగానే ఉన్నారు. ఈ మధ్య కాలంలో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు రాసాగాయి. మరి ఏం జరిగిందో తెలియదు.. శనివారం నాడు సాయిశ్రేయ..హెచ్‌ఏఎల్‌లోని తల్లి గారింట్లో ఉరి వేసుకుని చనిపోయింది. ఇక ఆమె భర్త రేశ్వంత్‌.. హెచ్‌ఎంటీ నిర్మానుష్య ప్రదేశంలో చెట్టుకు చున్నీతో ఉరి వేసుకుని మృతిచెందాడు. ఈ దారుణం గురించి రేశ్వంత్‌ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నిర్ణయంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రేమించి.. ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకుని.. జీవితాంతం కలిసి ఉంటామనే నమ్మకంతోనే కదా పెళ్లి చేసుకున్నారు. కానీ ఇంత చిన్న విషయానికి ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişcasibom