nagidream
Husband Stolen Wife Gold Jewellery In Nirmal District: భార్య నగలు తాకట్టు పెట్టి జల్సాలు చేసే భర్తలను చూసుంటారు. భార్య జీతం తీసుకుని జల్సాలు చేసే భర్తలను చూసుంటారు. కానీ భార్య నగలు కాజేసే భర్తను చూశారా?
Husband Stolen Wife Gold Jewellery In Nirmal District: భార్య నగలు తాకట్టు పెట్టి జల్సాలు చేసే భర్తలను చూసుంటారు. భార్య జీతం తీసుకుని జల్సాలు చేసే భర్తలను చూసుంటారు. కానీ భార్య నగలు కాజేసే భర్తను చూశారా?
nagidream
తన ఇంటికి తానే కన్నం వేసుకునే వారిని చూశారా? తన ఇంట్లో తానే దొంగతనానికి పాల్పడిన యజమానిని చూశారా? కానీ తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఓ ఇంటి యజమాని తన ఇంటికి తానే కన్నం వేసుకునే పరిస్థితి వచ్చింది. భార్య అడిగితే కాదనకుండా కొనిచ్చే భర్తలు ఉన్న ఈరోజుల్లో భార్య నగలను కాజేసే భర్తలు ఉంటారా? అంటే ఇదిగో ఈ వ్యక్తే అందుకు నిదర్శనం. ఏం కష్టమొచ్చిందో పాపం.. భార్య లేని సమయం చూసి ఆమె బంగారాన్ని కాజేశాడు. వేరే ఇంట్లో దాచి పెట్టి దొంగలు పడ్డారు, బంగారం పోయింది అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశాడు. భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. నిర్మల్ జిల్లా మహాదేవ్ పూర్ కాలనీలో ఓ ఇంట్లో భార్యాభర్తలు ఉన్నారు.
భార్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండగా.. భర్త ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. అయితే భార్యను బస్ ఎక్కించిన తర్వాత అటు నుంచి అటే డ్యూటీకి వెళ్ళిపోయాడు భర్త. అయితే భర్త డ్యూటీకి వెళ్లిన సమయంలో దొంగతనం జరిగిందని.. డబ్బులు, బంగారం పోయాయని భార్యకు చెప్పాడు. ఇంటికొచ్చిన భార్య బంగారం, డబ్బులు లేకపోవడంతో పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో తేలింది ఏంటంటే.. భర్తే భార్య డబ్బులు, నగలు కాజేశాడని.
శివ అనే వ్యక్తి తన ఇంట్లో ఉన్నటువంటి 8 తులాల బంగారం, మధ్యాహ్న సమయంలో దొంగతనం చేసినట్లు తెలిసిందని అన్నారు. భర్తే భార్య నగలు కాజేసి వేరే ఇంట్లో దాచిపెట్టాడని.. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు భార్య దగ్గర నటించాడని పోలీసులు గుర్తించారు. భర్త శివ భార్యను బస్ ఎక్కించిన తర్వాత డ్యూటీకి వెళ్లకుండా నేరుగా ఇంటికే వెళ్ళాడట. ఆ ఇంటి వైపు శివ తప్ప మరొకరు వెళ్లలేదని పోలీసులు పక్కింటి వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుసుకున్నారు. భర్త బైక్ మీద రావడం సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యింది. భర్తే తన ఇంట్లోకి వెళ్లి భార్య నగలు కాజేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మరి భార్య నగలు కాజేసి మరీ వేరే వాళ్ళ ఇంట్లో దాయాల్సిన అవసరం ఏముంది? పాపం ఇలాంటి కష్టం పగోడికి కూడా రాకూడదు.