iDreamPost
android-app
ios-app

Husband Killed Wife:అందమైన భార్యపై భర్త దారుణం! వీడు మనిషి కాదు మృగం!

  • Published Dec 26, 2023 | 1:54 PM Updated Updated Dec 26, 2023 | 5:47 PM

ప్రపంచంలో ఎక్కడ చూసినా రోజు రోజుకి హత్యల సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా భార్య భర్తల మధ్య వస్తున్న సమస్యలకు చావే పరిష్కారంగా మారుతోంది. ఈ క్రమంలో ఓ యువతిని తన భర్త దారుణంగా హత్య చేశాడు.

ప్రపంచంలో ఎక్కడ చూసినా రోజు రోజుకి హత్యల సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా భార్య భర్తల మధ్య వస్తున్న సమస్యలకు చావే పరిష్కారంగా మారుతోంది. ఈ క్రమంలో ఓ యువతిని తన భర్త దారుణంగా హత్య చేశాడు.

  • Published Dec 26, 2023 | 1:54 PMUpdated Dec 26, 2023 | 5:47 PM
Husband Killed Wife:అందమైన భార్యపై భర్త దారుణం! వీడు మనిషి కాదు మృగం!

పెద్దలు కుదిర్చిన వివాహం అయినా, ప్రేమ వివాహం అయినా కలహాలు రావడం సహజం. అయితే, ఆ కలహాలను పరిష్కరించుకునే మార్గాలు అనేకం. కానీ, ప్రస్తుతం అందరూ ఎంచుకుంటున్నది మాత్రం హత్య లేదా ఆత్మహత్య. నానాటికి వీటి సంఖ్య పెరిగిపోతోంది. ఇరువురి మధ్య పెరుగుతున్న మనస్పర్థలకు ఎందరో అమాయకులు బలి అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా కేరళలో జరిగిన ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. వారి మధ్య జరిగిన చిన్న గొడవ కారణంగా ఒక యువతిని దారుణంగా హతమార్చాడు తన భర్త. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కేరళలోని కొచ్చి ప్రాంతంలో రాజేష్(31), అనుమోలు (26) అనే జంట నివసిస్తున్నారు. కాగా, రాజేష్ పెయింటింగ్ పనులు చేస్తూ ఉంటాడు. కొంత కాలం క్రిందట వీరి ఇరువురు ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్నాళ్ళు వీరి సంసారం చక్కగా సాగిపోయింది. ఈ క్రమంలో వీరి మధ్యన చిన్న చిన్న సమస్యలు మొదలయ్యాయి. రాను రాను అవి కాస్త పెద్దవిగా మారాయి. దీనితో అనుమోలు తన పుట్టింటికి వెళ్ళిపోయింది. కుటుంబ సభ్యులు కలగచేసుకుని వీరివురి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. కానీ, ఉపయోగం లేకుండా పోయింది. అనుమోలు ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకుందంటూ రాజేష్ ఆమెపైన నిందలు వేశాడు. దీనితో వారిద్దరి మధ్య గొడవలు ఇంకాస్త పెరిగాయి.

ఈ క్రమంలో సొంత ఇంట్లోనే ఉన్న అనుమోలుపై రాజేష్ దారుణమైన హత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరు లేని సమయం చూసుకుని ఆమెపై హత్యాయత్నం చేశాడు. ఆమె తలపై సుత్తోతో కొట్టి, గొంతు కోసి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. దీనితో అనుమోలు తల్లి తండ్రులు ఇంటికి వచ్చే సరికి ఆమె గాయాలతో పడి ఉంది. ఆమెను వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కానీ, చికిత్స పొందుతూ అనుమోలు మరణించింది. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయగా.. వెంటనే నిందితుడైన రాజేష్ ను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.

కాగా, భార్య భర్తల మధ్యన తలెత్తిన మనస్పర్థలే ఈ హత్యకు కారణం అని.. పోలీసులు విచారణలో పేర్కొన్నారు. ఏదేమైనా, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు.. కొన్ని నిండు ప్రాణాలను బలికొంటున్నాయి. కుటుంబ కలహాలకు హత్యలు, ఆత్మహత్యలు పరిష్కారం కాదని.. దీనిపై అందరూ అవగాహన పెంచుకుంటే మంచిది. ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యపైన ఉన్న కాస్త అనుమానం.. ఈరోజు రాజేష్ ను మృగంలా ప్రవర్తించేలా చేసింది. మరి , కొచ్చిలో జరిగిన ఈ దారుణమైన సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet