iDreamPost
android-app
ios-app

ప్రియుడిపై సలసలకాగే నూనె పోసిన ప్రియురాలు! ఎందుకంటే?

  • Published Jul 28, 2023 | 4:56 PM Updated Updated Jul 28, 2023 | 4:56 PM
  • Published Jul 28, 2023 | 4:56 PMUpdated Jul 28, 2023 | 4:56 PM
ప్రియుడిపై సలసలకాగే నూనె పోసిన ప్రియురాలు! ఎందుకంటే?

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతి తన ప్రియుడు నిద్రపోయిన టైమ్ చూసి అతనిపై వేడి వేడి నూనె పోసింది. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాదాపు 50 శాతం కాలిన గాయాలతో కొన ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్నాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకు ప్రియుడిపై ఆ యువతి వేడి వేడి నూనె ఎందుకు పోసింది? అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా నకరికల్లులో ఆతుకూరి నాగరాజు-నాగమణి అనే యువతి, యువకుడు గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్నారు. కానీ, చాలా రోజులు గడిచినా ఆ యువతికి పిల్లలు కలగకపోవడంతో నగరాజు అవమానంగా భావించాడు. పిల్లలు పట్టకపోతే పది మంది చాలా రకాలుగా అనుకుంటారని అనుకున్నాడో ఏమో కానీ… నాగరాజు మరో యువతితో పెళ్లికి సిద్దపడ్డట్లు తెలుస్తోంది. ఇదే విషయం ఇటీవల ప్రియురాలు నాగమణికి తెలిసింది. దీంతో ఆమె ఒక్కసారిగా కోపంతో ఊగిపోయింది. నేనుండగా మరో యువతిని పెళ్లి చేసుకుంటావా అంటూ ప్రియుడిపై పగను తీర్చుకోవాలని అనుకుంది. ఇందులో భాగంగానే పక్కా ప్లాన్ తో ప్రియుడిపై హత్యాయత్నం చేయాలని స్కెచ్ గీసింది.

Girl kill attack on boyfriend

అయితే, ఈ నెల 26న ఇద్దరు తిని నిద్రపోయారు. కొద్దిసేపటికి నాగరాజు నిద్రలోకి వెళ్లిపోయాడు. ఇదే మంచి సమయం అనుకున్న నాగమణి.. తన ప్లాన్ అమలు చేసేందుకు సిద్దపడింది. ప్రియుడు నిద్రపోయింది చూసి సలసల కాగే నూనెను నాగరాజుపై పోసింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడి గట్టిగా అరుపులు చేశాడు. ఏం జరిగిందంటూ పక్కింటి వ్యక్తులు వచ్చి చూడగా.. ఆ యువకుడు అప్పటికే 50 శాతానికి పైగా కాలిపోయాడు. స్థానికులు వెంటనే అప్రమత్తమై అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనంతరం బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ప్రేమ అని నమ్మిన విద్యాశ్రీ జీవితం విషాదాంతం!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom