Hyderabad Gun Firing:హైదరాబాద్‌లో మరోసారి కాల్పుల కలకలం.. ఉలిక్కి పడిన పాతబస్తీ..!

హైదరాబాద్‌లో మరోసారి కాల్పుల కలకలం.. ఉలిక్కి పడిన పాతబస్తీ..!

Hyderabad Gun Firing: ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో తరుచూ కాల్పుల మోత వినిపిస్తుంది. కొంతమంది గ్యాంగ్‌స్టర్స్ తుపాకీలతో యధేచ్చగా కాల్పులు జరుపుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.

Hyderabad Gun Firing: ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో తరుచూ కాల్పుల మోత వినిపిస్తుంది. కొంతమంది గ్యాంగ్‌స్టర్స్ తుపాకీలతో యధేచ్చగా కాల్పులు జరుపుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.

ఇటీవల హైదరాబాద్ లో కొంతమంది గుండాలు, గ్యాంగస్టర్స్ రెచ్చిపోతున్నారు. సెటిల్ మెంట్స్, రియల్ ఎస్టేట్, భూ కబ్జాలు, కిడ్నాప్ వ్యవహారాలతో దందాలు నిర్వహిస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. అంతేకాదు రౌడీ షీటర్ల మద్య ఆధిపత్య పోరువల్ల గొడవల జరిగి కాల్పులకు తెగబడుతున్నారు. బీహార్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర నుంచి కొంతమంది అంతర్‌ రాష్ట్ర దొంగ ముఠా ఏటీఎం, జ్యులరీ షాపులు టార్గెట్ చేసుకొని దొంగతనాలు చేస్తున్నారు. ఆ సమయంలో పోలీసులు ఎదురుపడితే గన్ తో కాల్పులకు తెగబడుతున్న సంఘటనలు వెలుగు చూశాయి. తాజాగా హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని బాలాపూర్ ప్రాంతంలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. తుపాకీ కాల్పుల శబ్ధం వినపడగానే స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. రియాజ్(39) అనే లోకల్ రౌడీషీటర్ పై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.. ఈ కాల్పుల్లో రియాజ్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ కాల్పుల మోతతో పాతబస్తీ ఒక్కసారే ఉలిక్కిపడింది. బయటకు వస్తే ఏం జరుగుతుందో అని స్థానికులు భయపడిపోయారు. పాత కక్షల నేపథ్యంలో బాలాపూర్ ఆర్‌సీఐ రోడ్డులో వాహనం మీద వెళ్తున్న రియాజ్ ని కారుతో ఢీ కొట్టి కళ్లలో కారం జల్లి నాటు తుపాకితో కాల్పులు జరిపి హతమార్చారు.

ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి పరిశీలించారు. మృత దేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. హత్య జరిగిన ప్రదేశంలో బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రియాజ్ పై బాలాపూర్ తో పాటు హైదరాబాద్ మహానగరంలో ఎన్నో కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. రియాజ్ చిరకాల ప్రత్యర్థి నిజీర్ పై అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

Show comments