బీటెక్ స్టూడెంట్ రేణుశ్రీ కేసులో కొత్త కోణం.. అందుకే ఆత్మహత్య చేసుకుందా?

Btech Student Renusri: కాలేజీ భవనం మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్థిని రేణుశ్రీ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఆ వివరాలు..

Btech Student Renusri: కాలేజీ భవనం మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్థిని రేణుశ్రీ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఆ వివరాలు..

సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయంలో శుక్రవారం (జనవరి 5) మధ్యాహ్నం బీటెక్ ఫస్టియర్ చదువుతున్న రేణు శ్రీ అనే విద్యార్థిని.. కాలేజీ భవనం మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. మూడు నెలల క్రితం కాలేజీలో జాయిన్ అయిన విద్యార్థిని.. ఇంతలోనే ఆత్మహత్య చేసుకోవడం ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఇంత చిన్న వయసులో అంత పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది.. చనిపోవాల్సినంత కష్టం ఏం వచ్చింది అంటూ రేణు శ్రీ స్నేహితులు, బంధువుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక తాజాగా ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రేణు శ్రీ ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రేణు శ్రీ మూడు నెలల క్రితమే కాలేజీలో చేరిందని.. ఆమె గురించి.. తోటి విద్యార్థులకు ఎవరికి పెద్దగా తెలియదని సమాచారం. అంతేకాక రేణు శ్రీ కాలేజీకి సరిగా వచ్చేది కాదని మిగతా స్టూడెంట్స్ చెబుతున్నారు. దాంతో కొన్ని రోజుల క్రితమే రేణుశ్రీ తండ్రి.. ఆమెను కాలేజీకి వెళ్లే విషయంలో మందలించాడని.. రోజు కాలేజీకి వెళ్లాలని సూచించాడని తెలిసింది.

అంతేకాక రేణుశ్రీ ఆత్మహత్యకు ముందు ఎవరితోనే ఫోన్లో మాట్లాడిందని గుర్తించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాక రేణుశ్రీ తండ్రి మందలించడం వల్ల చనిపోయిందా.. లేక ప్రేమ వ్యవహారం వల్ల ఈ దారుణానికి పాల్పడిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రేణుశ్రీ ఐదంతస్తుల భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె భవనం పై నుంచి వెక్కివెక్కి ఏడుస్తూ.. భయపడుతూ దూకిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ వీడియోను చూసిన వారంతా.. వీడియో తీసే బదులుగా ఎమర్జెన్సీ అలారంను మోగిస్తే.. ఆమె బ్రతికి ఉండేదేమో కదా అని.. వీడియో తీసిన వారిపై మండిపడుతున్నారు నెటిజనులు. ఇక రేణుశ్రీ స్వస్థలం ఏలూరు కాగా.. ప్రస్తుతం ఆమె తల్లిదండ్రలు కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం అనంతరం ఏపీలోని ఏలూరులో ఉన్న స్వగృహానికి విద్యార్థిని మృతదేహాన్ని తీసుకువెళ్ళారు.

Show comments