iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: ఘట్కేసర్ బాలిక కిడ్నాప్ కథ సుఖాంతం.. కిడ్నాప్ చేసింది ఎవరో కాదు..!

  • Published Jul 06, 2023 | 1:15 PM Updated Updated Jul 06, 2023 | 1:15 PM
  • Published Jul 06, 2023 | 1:15 PMUpdated Jul 06, 2023 | 1:15 PM
బ్రేకింగ్: ఘట్కేసర్ బాలిక కిడ్నాప్ కథ సుఖాంతం.. కిడ్నాప్ చేసింది ఎవరో కాదు..!

ఘట్ కేసర్ లో కృష్ణవేణి అనే బాలిక కిడ్నాప్ గురైన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఖంగారుపడి గ్రామంలో అంతటా వెతికారు. ఎక్కడా కూడా కూతురి జాడ కనిపించలేదు. ఇక వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. కాగా, పోలీసులు 12 బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఎట్టకేలకు ఆ బాలికను రక్షించారు. దీంతో బాలిక కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. అసలేం జరిగిందంటే?

ఘట్ కేసర్ లోని EWS కాలనీలో కృష్ణవేణి అనే బాలిక నివాసం ఉంటుంది. అయితే, గురువారం ఉన్నట్టుండి ఆ బాలిక కనిపించకుండాపోవడంతో తల్లిదండ్రులు ఖంగారుపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు సురేష్ అనే వ్యక్తి బాలికను కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత అతడు ఆ బాలికతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉండగా పోలీసులు అతడిని పట్టుకుని బాలికను రక్షించారు. అనంతరం ఆ బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ తర్వాత నిందితుడు సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో బాలిక కిడ్నాప్ కథ సుఖాంతం అయింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet