Jogulamba-Bus Overturned, Fire Accident: గద్వాల్‌: బస్సులో చెలరేగిన మంటలు.. మహిళ సజీవ దహనం

Fire Accident: గద్వాల్‌: బస్సులో చెలరేగిన మంటలు.. మహిళ సజీవ దహనం

ప్రయాణికులతో వస్తోన్న ప్రైవేట్‌ బస్సు ఒకటి ప్రమాదానికి గురి కావడంతో.. దానిలో మంటలు చేలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళ సజీవదహనం అయ్యింది. ఆ వివరాలు..

ప్రయాణికులతో వస్తోన్న ప్రైవేట్‌ బస్సు ఒకటి ప్రమాదానికి గురి కావడంతో.. దానిలో మంటలు చేలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళ సజీవదహనం అయ్యింది. ఆ వివరాలు..

రెండు తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభతో వెల్లివిరుస్తున్నాయి. ఎక్కడెక్కడో ఉన్న వారు.. సొంత ఊళ్లకు తరలి వస్తున్నారు. బస్సులు, రైళ్లు కిటకిటలాడిపోతున్నాయి. ఆర్టీసీ బస్సులు, రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉండటంతో.. కొందరు ప్రైవేటు ట్రావేల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రయాణికులతో వస్తోన్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడటంతో దానిలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళ బస్సులోనే సజీవదహనం అయ్యింది. ఈ ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి.

జోగులాంబ గద్వాల జిల్లాలో శనివారం ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో.. నేషనల్ హైవే 44 మీద శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఈ ప్రమాదం వెలుగు చూసింది. హైదరాబాద్‌ నుంచి చిత్తూరు వెళుతున్న ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడడంతో దానిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటలో ఓ మహిళ సజీవదహనమైంది. ఈ ప్రమాదంలో సుమారు 10 మంది తీవ్రంగా గాయపడడ్డారని సమాచారం. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యం అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు వైద్యులు.

బస్సు బోల్తాపడిన విషయం గమనించిన వెంటనే దానిలో ఉన్న ప్రయాణికులు తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం.. బస్సు కిటికీల అద్దాలు పగులగొట్టి బయటికి వచ్చారు. కానీ ఒక మహిళ మాత్రం బస్సులోనే చిక్కుకుపోయింది. ఈలోపే బస్సులో మంటలు చెలరేగి.. పూర్తిగా దగ్ధమయ్యింది. దాంతో దానిలో చిక్కుకున్న మహిళ కూడా బస్సులోనే సజీవ దహనం అయ్యింది. ఇక ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటల్ని ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్సు డ్రైవర్‌ నిద్రమత్తు వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Show comments