ఉదయం పూట ఆఫీసుకు వెళ్లే హడావిడిలో పడి చాలా మంది టిఫిన్ చేయడం మరిచిపోతున్నారు. ఇలా నిర్లక్ష్యం చేయడం వల్ల చాలా వరకు నష్టాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
ఉదయం పూట ఆఫీసుకు వెళ్లే హడావిడిలో పడి చాలా మంది టిఫిన్ చేయడం మరిచిపోతున్నారు. ఇలా నిర్లక్ష్యం చేయడం వల్ల చాలా వరకు నష్టాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
ఉరుకుల పరుగుల జీవితంలో హడావిడిలో పడి ఉదయం చాలా మంది టిఫిన్ చేయడమే మానేస్తున్నారు. ఆఫీసుకు వెళ్లాక చేద్దాం లేం, ఓ గంట తర్వాత తిందాం లే అంటూ నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇక మరి కొందరు మాత్రం.. ఆఫీస్ పని బిజీలో పడి టిఫిన్ చేయడమే పూర్తిగా మానేసి సమయం పాలన లేకుండా తింటుంటారు. ఇలా నిర్లక్ష్యం చేయడం వల్ల చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు. ఇంతకు ఉదయం టిఫిన్ చేయకపోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి? అసలు నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ఉదయం పూట ఆఫీసుకు వెళ్లే హడావిడిలో పడి చాలా మంది టిఫిన్ చేయడం మరిచిపోతున్నారు. ఇలా నిర్లక్ష్యం చేయడం వల్ల చాలా వరకు నష్టాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఉదయం టిఫిన్ విషయంలో ఆలస్యం చేయడం వల్ల జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇంతే కాకుండా గుండెలు జబ్బులు, క్యాన్సర్ వంటి వచ్చే ఆస్కారం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా న్యూయర్క్ కు చెందిన ఇఖాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అధ్యయనాల్లో కూడా ఇదే తేలింది.
ఇందులో భాగంగానే ఇఖాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కొన్ని ఎలుకల మీద పరిశోధనలు ప్రారంభించాయి. ఉదయం కొన్ని ఎలుకలకు ఆహారం పెట్టగా, మరి కొన్ని ఎలుకలకు పెట్టలేదు. దీంతో ఆహారం తినని ఎలుకల ఆరోగ్యంపై దుష్ఫ్రభావాలు వస్తున్నాయని తెలుసుకున్నారు. ఇక మరుసటి రోజు ఆ ఎలుకలకు ఉదయం భోజనం పెట్టగా ఆ ఎలుకల ఆరోగ్యంలో మంచి మార్పులు వచ్చినట్లుగా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ఇక ఆఫీసు పనుల్లో పడి ఎవరైనా ఉదయం టిఫిన్ చేయడం నిర్లక్ష్యం చేస్తే.. గుండె, జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపడమే కాకుండా క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు తెలిపారు. ఇక ఉదయం అందరూ ఖచ్చితంగా టిఫిన్ చేయాలంటూ పరిశోధకులు సూచిస్తున్నారు.