iDreamPost
android-app
ios-app

కుత్బుల్లాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. కోట్లల్లో నష్టం!

  • Published Feb 28, 2024 | 8:31 AM Updated Updated Feb 28, 2024 | 8:36 AM

హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాఘవేంద్ర కాలనీని అనుకోని ఉన్న ఫ్రూట్స్ స్టాల్, మటన్ షాప్, స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంబవించింది.

హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాఘవేంద్ర కాలనీని అనుకోని ఉన్న ఫ్రూట్స్ స్టాల్, మటన్ షాప్, స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంబవించింది.

  • Published Feb 28, 2024 | 8:31 AMUpdated Feb 28, 2024 | 8:36 AM
కుత్బుల్లాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. కోట్లల్లో నష్టం!

హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. నిర్లక్ష్యం కారణంగా లేదా అజాగ్రత్తగా ఉండడం వల్ల అగ్ని ప్రమాదాలు జరగడానికి కారకులవుతున్నారు. ఆకస్మాత్తుగా సంబవించే ఈ ప్రమాదాల వల్ల భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసి పడిన అగ్ని కీలలతో స్థానికులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాఘవేంద్ర కాలనీని అనుకోని ఉన్న ఫ్రూట్స్ స్టాల్, మటన్ షాప్, స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంబవించింది. దట్టమైన మంటలు చెలరేగి బీభత్సం సృష్టించాయి. మంటల దాటికి షాపులు పూర్తిగా కాలిపోయాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. షాపులు పూర్తిగా దగ్ధమవడంతో కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş