iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్‌: శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం.. కోట్ల రూపాయల నష్టం

  • Published Aug 31, 2023 | 8:05 AM Updated Updated Aug 31, 2023 | 8:05 AM
  • Published Aug 31, 2023 | 8:05 AMUpdated Aug 31, 2023 | 8:05 AM
బ్రేకింగ్‌: శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం.. కోట్ల రూపాయల నష్టం

పండుగ పూట.. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలంలో.. భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆలయ ప్రాంగంణంలోని లలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్‌లో.. బుధవారం అర్ధరాత్రి తర్వాత ఎల్‌ బ్లాక్‌ సముదాయంలో మంటలు వ్యాపించాయి. ప్రమాదం వల్ల షాపింగ్‌ క్లాంప్లెక్స్‌లోని 15 షాపులు కాలి బూడిదయ్యాయి. అగ్నిప్రమాదం గురించి తెలిసిన వెంటనే.. దేవాలయం అధికారులు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దాంతో వారు.. సంఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను ఆదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఈ ప్రమాదం కారణంగా కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అంటున్నారు.

అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలియడంతో.. శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న వెంటనే.. ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదం కారణంగా సుమారు రూ.2 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగానే మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. షాపులపైనే విద్యుత్ స్తంభాలు ఉండడంతో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయి అన్నారు. ప్రమాదం అర్థ రాత్రి చోటు చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు అన్నారు.

Jojobet GirişMadridbetMariobetcasibommeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomcasibomgrandpashabetmeritbet girişgrandpashabet