iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: హైదరాబాద్‌లో పేలిన గ్యాస్ సిలిండర్.. ఏడుగురికి గాయాలు!

బ్రేకింగ్: హైదరాబాద్‌లో పేలిన గ్యాస్ సిలిండర్.. ఏడుగురికి గాయాలు!

ఈ మధ్యకాలంలో  తరచూ గ్యాస్ సిలిండర్ ప్రమాదాలు  జరుగుతూనే ఉన్నాయి. గ్యాస్ లీకు కావడం, పేలి పోవడం వంటి వాటి కారణంగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ గ్యాస్ పేలుడు ఘటనల కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో తీవ్రంగా గాయపడి..జీవితాన్ని నరకంగా అనుభవిస్తున్నారు.  తాజాగా హైదరాబాద్ మహానగరంలో గ్యాస్ లీకైన ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయలయ్యాయి.

హైదరాబాద్ దోమలగూడ  పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో గ్యాస్ లీక్ అయి మంటలను అంటుకున్నాయి.  ఈ ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. అలానే అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు పద్మ(55),ఆమె కుమార్తె ధనలక్ష్మి(30), మనవళ్లు అభినవ్(8),శరణ్య (6), విహార్ (3), పద్మ చెల్లెలు నాగులుగా గుర్తించారు. ప్రస్తుతం వీరందరూ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బోనాల పండుగను పురస్కరించుకొని తల్లిగారైన పద్మ ఇంటికి ధనలక్ష్మి ఆమె పిల్లలు వచ్చారు. అలానే పద్మ చెల్లెలు నాగులమ్మ కూడా వచ్చింది. ఎంతో సంతోషంగా బోనాల పండగ జరుపుకుంటున్న వేళ ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş