iDreamPost
android-app
ios-app

హాస్టల్‌ గదిలో ఒంటరిగా ప్రీతి.. ఫ్రెండ్స్‌ వచ్చి చూసే సరికి..

  • Published Jul 05, 2023 | 4:14 PM Updated Updated Jul 05, 2023 | 4:14 PM
  • Published Jul 05, 2023 | 4:14 PMUpdated Jul 05, 2023 | 4:14 PM
హాస్టల్‌ గదిలో ఒంటరిగా ప్రీతి.. ఫ్రెండ్స్‌ వచ్చి చూసే సరికి..

 ఈ మధ్య కాలంలో చిన్న చిన్న కారణాలకు ప్రాణాలు తీసుకునే వారు ఎక్కువయిపోయారు. కొంతమంది ప్రతీ సమస్యకు చావును పరిష్కారంగా భావిస్తున్నారు. ముఖ్యంగా యువతలో సూసైడల్‌ టెండెన్సీ బాగా పెరిగిపోయింది. నేడు ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న ఆత్మహత్యల్లో యువతే ఎక్కువ శాతం ఉండటం గమనార్హం. ప్రతీ నిత్యం దేశ వ్యాప్తంగా పదుల సంఖ్యలో యువతీ, యువకులు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా, ఓ యువతి హాస్టల్‌ గదిలో ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకలోని ఓ ప్రముఖ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

కర్ణాటకలోని కోలార్‌ జిల్లా, శ్రీనివాసాపురం తాలూకా ఎల్దూరు గ్రామానికి చెందిన 22 ఏళ్ల ప్రీతి.. చిక్కబళ్లాపూర్‌లోని ఓ ప్రముఖ కాలేజీలో ఇంజనీరింగ్‌ చదువుతోంది. ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతున్న ప్రీతి చదువులో ఎంతో చురుగ్గా ఉండేది. కాలేజీలోని లేడీస్‌ హాస్టల్‌లో ఉండి రోజూ క్లాసులకు హాజరయ్యేది. అయితే, ప్రీతి నిన్న కాలేజీకి వెళ్లలేదు. తనకు ఆరోగ్యం బాగోలేదని ఫ్రెండ్స్‌కు, వార్డెన్‌కు చెప్పి హాస్టల్‌ గదిలోనే ఒంటరిగా ఉండిపోయింది. సాయంత్రం ప్రీతి ఫ్రెండ్స్‌ హాస్టల్‌ గదికి వచ్చారు. తలుపు తెరిచి చూసే సరికి ప్రీతి సీలింగ్‌ వేసిన ఉరికి వేలాడుతూ కనిపించింది. దీంతో వారంతా ఒక్కసారిగా షాక్‌ తిన్నారు. వెంటనే హాస్టల్‌ వార్డెన్‌కు విషయం చెప్పారు.

వార్డెన్‌ ఈ విషయాన్ని ప్రీతి తల్లిదండ్రులకు, పోలీసులకు చెప్పింది. వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఆత్మహత్య జరిగిన చోట ఫార్మాలిటీస్‌ పూర్తి చేశారు. తర్వాత ప్రీతి మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం తరలించారు. కూతురి మృతిపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రీతి మరణానికి సంబంధించి ఎలాంటి కారణాలు బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో ప్రీతిది ఆత్మహత్యా? లేక ఎవరైనా చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారా? అన్న కోణాల్లో పోలీసులు అన్వేషిస్తున్నారు. మరి, హాస్టల్‌ గదిలో ప్రీతి ఆత్మహత్య చేసుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet