iDreamPost
android-app
ios-app

డీకే అరుణ కుమార్తె క్రెడిట్‌ కార్డు చోరి.. లక్షలు కాజేసిన డ్రైవర్‌!

  • Published Jul 07, 2023 | 3:14 PM Updated Updated Jul 08, 2023 | 10:45 AM
  • Published Jul 07, 2023 | 3:14 PMUpdated Jul 08, 2023 | 10:45 AM
డీకే అరుణ కుమార్తె క్రెడిట్‌ కార్డు చోరి.. లక్షలు కాజేసిన డ్రైవర్‌!

నేటి కాలంలో ఎవరిని నమ్మెలా లేవు పరిస్థితులు. నమ్మకంగా నటిస్తూనే.. గొంతు కోస్తున్నారు. మనం ఎంత గుడ్డిగా నమ్మితే.. అంత దారుణంగా మోసం చేస్తున్నారు. ఇలా మోసపోతన్న వారి జాబితాలో సామాన్యులే కాక సెలబ్రిటీలు కూడా ఉండటం గమనార్హం. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ కుమార్తె ఇలానే మోసపోయింది. వారి దగ్గర డ్రైవర్‌గా పని చేస్తోన్న వ్యక్తి.. డీకే అరుణ కుమార్తె క్రెడిట్‌ కార్డు చోరి చేసి దాన్నుంచి లక్షల రూపాయలు డ్రా చేశాడు. దాంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఆ వివరాలు..

మాజీ మంత్రి డీకే అరుణ కుమార్తె శ్రుతి రెడ్డి వద్ద డ్రైవర్‌గా పని చేస్తోన్న వ్యక్తి ఈ మోసానికి పాల్పడ్డాడు. శ్రుతి రెడ్డి వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్న వ్యక్తి.. ఆమె క్రెడిట్ కార్డు దొంగిలించి లక్షల రూపాయలు కొట్టేశాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. డీకే అరుణ కుమార్తె శ్రుతి రెడ్డి బంజారాహిల్స్‌లోని రోడ్‌ నంబర్‌​ 14 ప్రేమ్​ పర్వత్​ విల్లాస్‌లో నివాసం ఉంటుంది. ఆమె వద్ద బీసన్న అనే వ్యక్తి గత కొంత కాలంగా డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా బీసన్న శ్రుతి రెడ్డి ఇంట్లో పెట్టిన హెచ్​డీఎఫ్‌సీ క్రెడిట్​ కార్డును దొంగిలించాడు. దాన్ని తీసుకుని.. శ్రుతికి తెలిసిన మహావీర్​ జెమ్స్‌ అండ్‌ పెరల్స్‌ అనే నగల దుకాణానికి వెళ్లి.. శ్రుతి పేరు చెప్పి రూ.11 లక్షలు డ్రా చేశాడు.

బీసన్న డబ్బులు డ్రా చేసిన విషయం శ్రుతి రెడ్డికి తెలిసింది. వెంటనే డ్రైవర్‌ని దీని గురించి నిలదీసింది. కానీ అతడు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో.. అనుమానం వచ్చిన శృతి రెడ్డి.. డ్రైవర్‌ బీసన్నపై బంజరాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో గురించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బీసన్నను అదుపులోకి తీసుకుని.. విచారిస్తున్నారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom